టాలీవుడ్ హీరో నితిన్ పెళ్లి కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా బుధవారం అతని నివాసంలో నిశ్చితార్థం జరిగింది. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 26న హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో రాత్రి 8.30 నిమిషాలకు షాలిని, నితిన్‌ల వివాహం జరగనుంది.
నితిన్‌ది అరేంజ్డ్ కమ్ లవ్ మ్యారేజ్. నాలుగేళ్లుగా ఒకరికొకరు తెలుసు. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య ప్రేమ చిగురించడం వల్ల.. తమ కుటుంబ సభ్యులకు చెప్పి పెళ్లికి ఒప్పించారు.
డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని ఆకాంక్షించిన ఈ హీరో.. కరోనా వైరస్ కారణంగా తన వివాహన్ని వాయిదా వేస్తూ వచ్చారు. కానీ కొవిడ్ కేసులు పెరుగుతున్నందున హైదరాబాద్‌లోనే కుటుంబసభ్యుల సమక్షంలో నిరాడంబరంగా వివాహం చేసుకునేందుకు నితిన్ సిద్ధమయ్యాడు.