ETV Bharat / sitara

'జయం'తో వచ్చి.. అభిమానుల 'ఇష్క్​' గెలిచి!

'జయం', 'దిల్​' సినిమాల విజయాలతో చిన్న వయసులోనే స్టార్​ హోదాను దక్కించుకున్నారు​ యువ కథానాయకుడు నితిన్​. ఆ తర్వాత వచ్చిన చిత్రాలతో అదే జోరును కొనసాగించలేకపోయారు. వరుసగా 12 ఫ్లాప్​ల తర్వాత ఇష్క్​ సినిమాతో తిరిగి ఫామ్​లోకి వచ్చారు. ఇలా హీరోగా తన సినీ ప్రయాణం​లో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశారు. మంగళవారం (మార్చి 30) నితిన్​ పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని విశేషాలను తెలుసుకుందాం.

Nithiin Birthday
నితిన్​ పుట్టినరోజు
author img

By

Published : Mar 30, 2021, 5:32 AM IST

చిత్రపరిశ్రమలో హీరోగా కెరీర్ ఆరంభించిన తొలినాళ్లలో రెండు వరుస విజయాలు అందుకున్నా.. ఆ తర్వాత వచ్చిన సినిమాలతో పడుతూ లేస్తూ సినీ ప్రయాణాన్ని నెట్టుకొచ్చారు. 'ఇష్క్​' సినిమా లాంటి సరికొత్త ప్రేమకథతో సక్సెస్​ను అందుకొని.. అక్కడి నుంచి వరుస చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు యువ కథానాయకుడు నితిన్. చిత్రసీమలో అడుగుపెట్టి ఇటీవలే 18 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. మంగళవారం (మార్చి 30) ఆయన పుట్టినరోజు సందర్భంగా నితిన్​ వ్యక్తిగత జీవితంతో పాటు సినిమా విశేషాలను తెలుసుకుందాం.

Nithiin Birthday
నితిన్​

వ్యక్తిగతం

నితిన్​.. 1983 మార్చి 30న తెలంగాణలోని నిజామాబాద్​లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు చిత్ర పంపిణీ దారు సుధాకర్​ రెడ్డి, లక్ష్మీ రెడ్డి. నిఖితా రెడ్డి సోదరి. హైదరాబాద్​లోని గీతాంజలి స్కూల్​లో ప్రాథమిక చదువును పూర్తి చేశారు. రత్న జూనియర్​ కళాశాలలో ఎమ్​.పీ.సీ విభాగంలో ఇంటర్మీడియట్​ చదివారు. గతేడాది శాలిని కందుకూరి అనే ఆమెను ప్రేమించి పెళ్లాడారు నితిన్​.

సినీ అరంగేట్రం

'నువ్వు నేను' సినిమాను సుదర్శన్​ 35ఎమ్​ఎమ్​ థియేటర్లో​ ప్రదర్శిస్తున్న సమయంలో దర్శకుడు తేజ.. నితిన్​ను రెండుసార్లు చూశారట. ఆ తర్వాత నితిన్​ గురించి ఆరా తీసి.. నటనలో ఆసక్తి ఉందో లేదో కనుక్కొని ఆ తర్వాత 'జయం' సినిమాలో హీరోగా నితిన్​కు అవకాశాన్ని ఇచ్చారట. అలా తేజ డైరెక్షన్​లో నితిన్​, సదా హీరోహీరోయిన్లుగా రూపొందిన జయం సినిమా 2002 ఫిబ్రవరి 14న విడుదలైంది.

ఆ సినిమా సూపర్​హిట్​ తర్వాత వి.వి.వినాయక్​ దర్శకత్వంలో దిల్​ సినిమాలో నితిన్​ హీరోగా నటించారు. ఈ చిత్రం కూడా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించడం వల్ల నితిన్​కు ఒక్కసారిగా స్టార్​ డమ్​ వచ్చేసింది. ఇదే సినిమాతో సినిమాల పంపిణీ దారుగా ఉన్న దిల్​ రాజు నిర్మాతగా మారారు.

'దిల్' తర్వాత నితిన్​ హీరోగా తెరకెక్కిన చిత్రాలు 'సంబరం', 'శ్రీ ఆంజనేయం' వంటి సినిమాలు అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఎస్​ఎస్​ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'సై' చిత్రంతో బ్లాక్​బస్టర్​ను తన ఖాతాలో వేసుకున్న నితిన్​.. ఆ తర్వాత విడుదలైన 'ధైర్యం', 'అజ్యాత్​' (హిందీ చిత్రం), 'సీతారాముల కల్యాణం' సినిమాలు కమర్షియల్​గా సక్సెస్​ను అందుకోలేకపోయారు.

Nithiin Birthday
నితిన్​, త్రివిక్రమ్​

వరుస ఫ్లాప్​లు..

12 సినిమాలు ఫ్లాపుల తర్వాత దర్శకుడు విక్రమ్​ కే కుమార్​ రూపొందించిన 'ఇష్క్' సినిమాతో హిట్​ను అందుకున్నారు. ఆ తర్వాత విడుదలైన 'గుండెజారి గల్లంతయ్యిందే' సినిమా కూడా బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు సాధించింది. ఈ రెండు సినిమాల తర్వాత మరో మూడు సినిమాలతో నిరాశ పరిచినా.. త్రివిక్రమ్​ తెరకెక్కించిన 'అఆ'తో సూపర్​హిట్​ను అందుకున్నారు నితిన్.

సతీశ్​ వేగ్నెశ దర్శకత్వంలో రూపొందిన 'శ్రీనివాస కల్యాణం' ఫర్వాలేదనిపించినా.. కలెక్షన్లు మాత్రం రాబట్టలేకపోయింది. ఈ సమయంలో 'భీష్మ' లాంటి కమర్షియల్​ ఎంటర్​టైనర్​తో సాలిడ్​హిట్​ను అందుకున్నారు నితిన్​. ఈ చిత్రం తన కెరీర్​లోనే బిగ్గెస్ట్​ హిట్​గా నిలిచింది. ఈ సినిమా తర్వాత 'చెక్​' సినిమా విడుదలై.. నితిన్​ నటనకు మరోసారి మంచి పేరు దక్కింది. ఇటీవలే విడుదలైన 'రంగ్​దే' చిత్రం విజయవంతంగా ప్రదర్శన జరుపుకొంటోంది. ప్రస్తుతం 'అంధాదున్' తెలుగు రీమేక్​లో నటిస్తూ బిజీగా ఉన్నారు నితిన్​.

సింగర్​గా..

ఇష్క్​ సినిమాలో 'లచ్చమ్మ' పాటతో గాయకుడి అవతారమెత్తారు హీరో నితిన్​. ఆ తర్వాత విడుదలైన 'గుండెజారి గల్లంతయ్యిందే' చిత్రంలోని 'డింగ్​ డింగ్​ డింగ్​' పాటతోనూ మెప్పించారు.

Nithiin Birthday
పవన్​ కల్యాణ్​, నితిన్

నిర్మాతగా..

విజయ్​ కుమార్​ కొండా దర్శకత్వంలో రూపొందిన 'గుండెజారి గల్లంతయ్యిందే' చిత్రానికి నితిన్​ హీరోగానూ, నిర్మాతగానూ వ్యవహరించారు. అక్కినేని వారసుడు అఖిల్​ హీరోగా టాలీవుడ్​కు పరిచయమైన 'అఖిల్​' చిత్రానికి నిర్మాతగా ఉన్నారు. అలాగే తాను నటించిన 'చిన్నాదాన నీకోసం' సినిమాకు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.

పురస్కారాలు

  • 'జయం' సినిమాకు గానూ ఉత్తమ అరంగేట్ర నటుడిగా ఫిల్మ్​ఫేర్​ అవార్డు దక్కించుకున్నారు నితిన్.
  • 'శ్రీఆంజనేయం' చిత్రానికి గానూ యంగ్​ బెస్ట్​ పెర్ఫార్మర్​ అవార్డు నితిన్​ను వరించింది.

ఇదీ చూడండి: 'కాంచన 3' భామ అందాలు చూస్తే మతిపోవాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.