టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ.. చిన్నారి అభిమాని మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశాడు. డెంగ్యూతో మరణించిన గోకుల్‌కు సంతాపం ప్రకటించాడు. చిన్న వయసులో అతడు ఈ లోకాన్ని విడిచి వెళ్లడం బాధ కలిగించిందని అన్నాడు. ఫేస్బుక్లో ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు.
"మాకు అభిమానుల కంటే విలువైనది మరొకటి ఉండదు. అలాంటి చిన్నారి అభిమాని గోకుల్. నేనంటే ప్రాణం ఇచ్చే ఈ చిన్నారి ఈ రోజు ప్రాణాలతో లేడన్న నిజం నా మనసును కలచివేసింది. అతడు డైలాగులు చెప్పిన విధానం, హావభావాలు చూసి నాకు ఎంతో ముచ్చటేసేది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ చిన్నారి ఇంత చిన్న వయసులో డెంగ్యూ వ్యాధితో ఈ లోకాన్ని విడిచి వెళ్లడం చాలా బాధ కలిగించింది. ఈ చిన్నారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" -నందమూరి బాలకృష్ణ, హీరో
ప్రస్తుతం బాలకృష్ణ.. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఆ తర్వాత బోయపాటి తెరకెక్కిస్తున్న సినిమాలో హీరోగా కనిపించనున్నాడు.
ఇది చదవండి: బాలయ్య దూకుడు.. పూరీతో మరో చిత్రం..!