ETV Bharat / sitara

తెలుగు హీరోగానే ఉంటా: హీరో అఖిల్ - akhil movie review

'మోస్ట్ ఎలిజిబుల్​ బ్యాచ్​లర్' ప్రేమకథే అయినప్పటికీ చాలా కొత్తగా తీశారని హీరో అఖిల్ అన్నాడు. కుటుంబం అంతా కలిసి ఈ సినిమా చూడొచ్చని తెలిపాడు.

hero akhil about most eligible bachelor movie
అఖిల్
author img

By

Published : Oct 15, 2021, 5:32 AM IST

సరిగా మాటలు కూడా రాని వయసులోనే నటించి, అందరి దృష్టిని ఆకర్షించాడు. కట్‌ చేస్తే, 'అఖిల్‌' చిత్రంతో హీరోగా మారాడు. అందం, అభినయంలో అక్కినేని వారసుడు అనిపించుకున్నాడు. 'హలో', 'మిస్టర్‌ మజ్ను' వంటి చిత్రాలతో మెప్పించి, ఇప్పుడు 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌'గా సందడి చేయబోతున్నాడు. ఆ 'సిసింద్రీ' ఎవరో కాదు అక్కినేని అఖిల్‌. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌'. పూజా హెగ్డే కథానాయిక. ఈ సినిమా అక్టోబరు 15న విడుదల కానుంది. ఈ సందర్బంగా అఖిల్‌ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నాడు.

.
.

రొమాన్స్‌ అంటే అది కాదు..

నిర్మాత అరవింద్‌గారు ఓ లవ్‌స్టోరీ చేయాలన్నప్పుడు 'అబ్బా! ఇంకో లవ్‌స్టోరీనా' అని ఫీలయ్యా. ప్రేమ కథంటే గొప్పగా ఏముంటుంది? రొటీనే కదా అని అనుకుంటూనే ఆయన ఆఫీసుకు వెళ్లా. అక్కడ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌ కథ వినిపించారు. ప్రేమ, పెళ్లి విషయంలో మనం ఎదుర్కొనే సమస్యలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఆయన చెప్పిన విధానం నన్ను ఆకట్టుకుంది. ప్రేమకథే అయినా చాలా కొత్తగా అనిపించింది. ఒకనొకరు తాకడం ఒక్కటే రొమాన్స్‌ కాదని ఈ చిత్రంలో చూపించాం. ప్రేయసికి లేఖ రాయడం రొమాన్సే, పువ్వు ఇవ్వడమూ రొమాన్సే. ఇలాంటి ఎన్నో విషయాల్ని భాస్కర్‌గారు చాలా అద్భుతంగా చిత్రీకరించారు.

.
.

నిజాయతీగా నటించా..

కమర్షియల్‌ ఫార్ములా అనే సేఫ్‌ జోన్‌ నుంచి బయటికొచ్చి నిజాయతీగా నటించిన చిత్రమిది. తెరపై నేను కాదు నా పాత్ర మాత్రమే కనిపించాలనుకున్నా. అందుకు తగ్గట్టు నన్ను నేను మలచుకున్నా. నేను హర్ష అనే పాత్రలో కనిపిస్తా. ఓ దశలో అల్లరి చేసే యువకుడిగా, కొన్ని సన్నివేశాల్లో మెచ్యూరిటీ ఉన్న వ్యక్తిగా రెండు విభిన్న కోణాలు ఆవిష్కరించా. బాయ్‌ నుంచి మ్యాన్‌గా మారే క్రమంలో హర్ష ఏం నేర్చుకున్నాడనేది ఆసక్తికరంగా ఉంటుంది.

.
.

ఇబ్బంది పడతా..

కథను బలంగా నమ్మాను. భాస్కర్‌ గత చిత్రం 'బొమ్మరిల్లు'లో క్లైమాక్స్‌ అందరినీ హత్తుకుంది. అదొక్కటే కాదు ఏ సినిమాకైనా క్లైమాక్సే ముఖ్యమైంది. ఇందులోనూ మంచి ముగింపు ఉంటుంది. ఇలాంటి విషయాల్లో భాస్కర్‌ పక్కాగా ఉంటారు. విభావరి అనే పాత్రలో పూజా హెగ్డే ఒదిగిపోయింది. స్టాండప్‌ కమెడియన్‌గా ఆమె నటన అందరినీ అలరిస్తుంది. ఓపెన్‌గా మాట్లాడే వ్యక్తిత్వం ఉన్న పాత్ర అది. ఎక్కడా అసభ్య పదజాలం ఉండదు. కొన్ని స్పైసీ సంభాషణలు ఉన్నా మనం ఓపెన్‌ మైండ్‌తో చూస్తే ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. కుటుంబమంతా కలిసి ఈ సినిమా చూడొచ్చు.

ఆ ఆసక్తి లేదు..

ఈ సినిమాలో 'పెళ్లి చూపులు' కాన్సెప్ట్‌ అందరికీ బాగా కనెక్ట్‌ అవుతుంది. ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ ప్రేక్షకులకు గుర్తుండిపోతారు. 'జాతి రత్నాలు' ఫేం ఫరియా అబ్దుల్లా ఆ చిత్రం విడుదలకు ముందే ‘బ్యాచ్‌లర్‌’లో నటించింది. ‘సిసింద్రీ’ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు ఆమనిగారితో నటించడం చాలా ఆనందంగా అనిపించింది. నేనెప్పుడూ సినిమా ఫలితం గురించి ఆలోచించను. ఎంపిక చేసుకున్న పాత్రకు న్యాయం చేసేందుకు నా వంతు కృషి చేస్తా. కెరీర్‌ పరంగా వేగం పెంచాలనుకున్న సమయంలో కొవిడ్‌ వచ్చింది. కొత్త ప్రాజెక్టుల గురించి త్వరలో తెలియజేస్తా. ప్రస్తుతానికి బాలీవుడ్‌, హాలీవుడ్‌కు వెళ్లే ఆసక్తి లేదు. నాకు ఇక్కడే ఉండాలని ఉంది. నేను తెలుగు హీరోగానే ఉంటా.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.