విశాఖ జిల్లాలోని దారాలమ్మ అమ్మవారిని దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు, హీరో ఆకాశ్ దర్శించుకున్నారు. ఇటీవల తను కథానాయకుడిగా నటించిన చిత్రం విజయవంతం కావాలని అమ్మవారిని పూజించినట్లు తెలిపారు. లంబసింగి నుంచి సీలేరు వరకు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉందని యువ కథానాయకుడు తెలిపారు.
సినిమా షూటింగ్లకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆకాశ్తో పాటు నర్సీపట్నం ఎమ్మెల్యే పెంట్ల ఉమాశంకర్ గణేశ్ కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు.
ఇవీచూడండి: నా నిజమైన బాలీవుడ్ హీరో ఇతడే: ప్రియాంక