ETV Bharat / sitara

'వాలిమై' కోసం అజిత్​ సూపర్​ స్టంట్స్​ - అజిత్​ సూపర్​ స్టంట్స్​

'వాలిమై' సినిమా కోసం హీరో అజిత్​ అద్భుతమైన స్టంట్స్​ చేశారని అన్నారు ఈ చిత్రంలో నటించిన నటుడు ఆర్​.కె. సురేష్​. అవన్నీ ఈ మూవీకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు.

ajith
అజిత్​
author img

By

Published : May 19, 2021, 7:15 AM IST

తమిళ సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో 'వాలిమై' ఒకటి. అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. హెచ్. వినోద్ దర్శకుడు. బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి నటుడు ఆర్.కె. సురేష్ పలు ఆసక్తికర విషయాల్ని ఓ మీడియా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. "వాలిమై'లో శక్తిమంతమైన యాక్షన్ సన్నివేశాలున్నాయి. వాటి కోసం అజిత్ కొన్ని అద్భుతమైన స్టంట్స్ చేశారు. అవన్నీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సినిమా ఆయన కెరీర్లో ఓ మైలురాయి అవుతుంది. ప్రేక్షకుల్ని మళ్లీ థియేటర్లకు తీసుకొచ్చేలా చేస్తుంది" అని ఆ ఇంటర్వ్యూలో సురేష్ వెల్లడించారు.

సురేష్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించారు. దీంట్లో తెలుగు యువ కథానాయకుడు కార్తికేయ విలన్​గా నటిస్తున్నారు.

ఇదీ చూడండి: ఈ స్టార్స్​ కొత్త కబురు వినిపిస్తారా?

ఇదీ చూడండి: ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తి 'తలా' అజిత్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.