ETV Bharat / sitara

Prabhas: సలార్ అప్డేట్​ వచ్చేసింది! - rajamannar first look

రెబల్​ స్టార్​ ప్రభాస్​ నటిస్తున్న సలార్​ చిత్రానికి సంబంధించి తాజా అప్డేట్ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించి రాజమన్నార్​ ఫస్ట్ లుక్​ను సోమవారం విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. పాన్​ఇండియా స్థాయిలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

salaar movie
సలార్ సినిమా
author img

By

Published : Aug 22, 2021, 2:34 PM IST

పాన్​ఇండియా స్టార్​ ప్రభాస్​, శ్రుతిహాసన్​ హీరో హీరోయిన్​గా నటిస్తున్న చిత్రం 'సలార్'​. కేజీఎఫ్​ ఫేమ్​ ప్రశాంత్​ నీల్​ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించి ఓ అప్డేట్​ వచ్చింది.

ఆగస్టు 23న ఉదయం 10.30 గంటలకు రాజమన్నార్​ ఫస్ట్​ లుక్​ విడుదల చేయనున్నట్లు సలార్ చిత్రబృందం వెల్లడించింది. రాజమన్నార్​ పాత్రలో ఎవరు నటిస్తున్నారనేది స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఈ ఫస్ట్​ లుక్​ గురించి అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అతికొద్ది గంటల్లో ఈ ఉత్కంఠకు తెరపడనుందని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.

heres a massive update on prabhas salaar
సలార్​ మూవీ

​'సలార్​' చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో రూపొందించడం సహా పాన్​ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంతోనే కన్నడలోకి ప్రభాస్​ అరంగేట్రం చేయనున్నారు. 'కేజీఎఫ్​' ఫేమ్​ రవి బస్రూర్​ సంగీతాన్ని అందిస్తున్నారు. కన్నడ నటుడు మధు గురుస్వామి కీలకపాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

ఇదీ చదవండి: చిరంజీవికి రాఖీ కట్టిన కీర్తి సురేశ్.. స్పెషల్ వీడియో రిలీజ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.