అల్లు శిరీష్ (alli sirish) కథానాయకుడిగా జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌లో ఓ చిత్రం (sirish6) రూపొందుతోంది. అను ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel) కథానాయిక. 'విజేత' ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వం వహించబోతున్నాడు. 'ఏబీసీడీ' తర్వాత శిరీష్ నుంచి వస్తున్న కొత్త చిత్రమిది. ఈనెల 30న ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ చిత్రం నుంచి ఆయన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నారు. అయితే రెండురోజులుగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్‌ను విడుదల చేస్తున్నారు.
ఈ పోస్టర్లలో శిరీష్, అను మధ్య కెమెస్ట్రీ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ప్రీ లుక్‌లే ఇలా ఉంటే సినిమా ఎంత రొమాంటిక్‌గా ఉంటుందో అని అనుకుంటున్నారు నెటిజన్లు. పోస్టర్లను బట్టి ఈ మూవీ మోడ్రన్ లవ్ నేపథ్యంలో సాగనుందని తెలుస్తోంది.

ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను 30వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. సాంకేతిక నిపుణుల వివరాలను ఫస్ట్‌లుక్‌తో పాటు పంచుకోనున్నట్లు సమాచారం.
