ETV Bharat / sitara

20ఏళ్ల తర్వాత భన్సాలీ దర్శకత్వంలో మాధురి! - మాధురి దీక్షిత్​ హారా మండి

బాలీవుడ్​ సీనియర్​ నటి మాధురి దీక్షిత్​.. దర్శకుడు సంజయ్​ లీలా భన్సాలీ తెరకెక్కించబోయే 'హీరా మండి' వెబ్​సిరీస్​లో నటించనున్నారని సమాచారం. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. ఇదే నిజమైతే దాదాపు 20ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబో రిపీట్​ అయినట్లవుతుంది.

sanjay
సంజయ్​
author img

By

Published : May 22, 2021, 8:52 AM IST

డ్యాన్సింగ్​ క్వీన్​ మాధురి దీక్షిత్​.. విభిన్న చిత్రాల దర్శకుడు సంజయ్​ లీలా భన్సాలీ డైరెక్షన్​లో నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. దాదాపు 20ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబో రిపీట్​ కానుంది.

సంజయ్​లీలా భన్సాలీ.. సోనాక్షి సిన్హా, హ్యూామా ఖురేషీతో 'హీరా మండి' వెబ్​సీరీస్​ తెరకెక్కించనున్నారు. ఈ సిరీస్​లోనే మాధురి ముజ్రా అనే ఓ ప్రత్యేక గీతంలో అలరించనుందని తెలుస్తోంది. ఇప్పటికే భన్సాలీ-మాధురి మధ్య చర్చలు జరిగాయని, త్వరలోనే అధికార రానుందట. పది రోజుల పాటు ఈ గీతం చిత్రీకరణ జరుగుతుందని ఇందుకోసం మాధురి పెద్ద మొత్తంలో తీసుకుంటున్నట్లు సమాచారం. అంతకుముందు 2002లో సంజయ్​ దర్శకత్వంలో షారుక్​ ఖాన్​, ఐశ్వర్యా రాయ్​ జంటగా వచ్చిన 'దేవదాస్​' సినిమాలో మాధురి దీక్షిత్​ నటించారు.

సంజయ్​.. ప్రస్తుతం హీరోయిన్​ ఆలియా భట్​తో 'గంగూబాయ్​ కతియావాడి' సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వల్ల చిత్రీకరణ తాత్కాలికంగా వాయిదా పడింది.

ఇదీ చూడండి: ఈ డ్యాన్సింగ్​ క్వీన్​ అందానికి ఫిదా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.