'కేజీఎఫ్ -2' హీరో యష్‌కు.. కర్ణాటక ఆరోగ్య శాఖ, యాంటీ టొబాకో సెల్ నోటీసులు జారీ చేసింది. టీజర్‌లోని పొగ తాగే సన్నివేశాలపై అభ్యంతరం తెలిపింది. వెంటనే వాటిని తొలగించాలని స్పష్టం చేసింది.
టీజర్లో యష్ పొగ తాగే సీన్స్, టొబాకో 2003 చట్టంలోని సెక్షన్ 5 నిబంధనల అతిక్రమణ కిందకు వస్తాయని యాంటీ టొబాకో సెల్ చెప్పింది. ఆన్లైన్లో ప్రస్తుతమున్న టీజర్‌లోని ఆ సన్నివేశాల్ని, పోస్టర్లను తక్షణమే తీసేయాలని చిత్రబృందానికి ఆదేశాలు జారీ చేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కథానాయకుడు యష్‌కు అత్యధిక సంఖ్యలో అభిమానులు ఉన్నారని, అందులో యువత ఎక్కువని నోటీసులో కర్ణాటక ఆరోగ్య శాఖ పేర్కొంది. సినిమాలో పొగ తాగే సన్నివేశాల వల్ల యువత పెడదోవ పట్టే అవకాశముందని తెలిపింది. దాని వల్ల క్యాన్సర్, సంబంధిత వ్యాధులు వస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు ఓ లేఖను యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కిర్గాందర్, కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్‌కు పంపించింది.
ఇది చదవండి: 'కేజీఎఫ్ 2' టీజర్ రికార్డు.. 24 గంటల్లోనే ఆ ఘనత