ETV Bharat / sitara

''గుంజన్​ సక్సేనా' ప్రదర్శన నిలుపుదల కుదరదు'

'గుంజన్​ సక్సేనా' ప్రదర్శన నిలిపివేయాలన్న కేంద్రం విజ్ఞప్తిని దిల్లీ హైకోర్టు తిరస్కరించింది. అయితే కేంద్రం చేసిన ఆరోపణలపై నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

Gunjan Saxena - The Kargil Girl news
''గుంజన్​ సక్సేనా' ప్రదర్శన నిలుపుదల కుదరదు'
author img

By

Published : Sep 2, 2020, 2:31 PM IST

Updated : Sep 2, 2020, 3:13 PM IST

'గుంజన్​ సక్సేనా - ది కార్గిల్​ గర్ల్​' చిత్రాన్ని భారత వైమానిక దళంపై దురభిప్రాయం కలిగేలా తీశారని కేంద్ర ప్రభుత్వం దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. నెట్​ఫ్లిక్స్​లో చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని పిటిషన్​లో కోరగా, ఆ విజ్ఞప్తిని కోర్టు నిరాకరించింది.

ఓటీటీలో విడుదల కాకముందే కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని పిటిషనర్​కు జస్టిస్​ రాజీవ్​ సూటి ప్రశ్న వేశారు. సినిమా ఇప్పటికే ప్రసారం అవుతుండటం వల్ల ప్రదర్శన నిలిపివేయడం కుదరదని తేల్చి చెప్పారు.

లింగవివక్ష లేదు

'గుంజన్​ సక్సేనా' చిత్రంలో భారత వైమానిక దళంలో లింగవివక్ష ఉందనే విధంగా సన్నివేశాలు రూపొందించారని, అందులో ఏమాత్రం నిజం లేదని కేంద్రం తరఫు న్యాయవాది అడిషనల్​ సొలిసిటర్​ జనరల్​ సంజయ్​ జైన్​ కోర్టుకు తెలిపారు. దీనిపై చిత్ర నిర్మాణసంస్థ ధర్మ ప్రొడక్షన్స్​ ప్రైవేట్​ లిమిటెడ్​ వివరణ ఇవ్వాలని కోర్టు కోరింది.

గుంజన్​ స్పందన కావాలి

భారత వైమానిక దళ మాజీ పైలట్​, లెఫ్టినెంట్ గుంజన్​ సక్సేనాను కూడా ఈ పిటిషన్​లో చేర్చి.. కేంద్రం ఆరోపణలపై స్పందన కోరుతూ, నోటీసు జారీ చేయాలని కోర్టు అభిప్రాయపడింది. ఈ చిత్రం ఆగస్టు 12న నెట్​ఫ్లిక్స్​లో విడుదలై, మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంటోంది.

Last Updated : Sep 2, 2020, 3:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.