ETV Bharat / sitara

క్యాన్సర్​తో పోరాడుతూ ప్రముఖ నిర్మాత మృతి - Producer Harish Shah news

బాలీవుడ్​ పలు విజయవంతమైన చిత్రాలను తీసి దర్శకుడిగా, నిర్మాతగా పేరు తెచ్చుకున్న హరీష్ షా మరణించారు. అయితే గొప్ప నిర్మాతను కోల్పోయామని, పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

క్యాన్సర్​తో పోరాడుతూ ప్రముఖ నిర్మాత మృతి
నిర్మాత హరీశ్ షా
author img

By

Published : Jul 7, 2020, 4:22 PM IST

బాలీవుడ్‌ ప్రముఖ దర్శక-నిర్మాత‍ హరీష్ షా(76) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన.. ఈ రోజు(జులై 7) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ విషయమై స్పందించిన పలువురు బాలీవుడ్​ ప్రముఖులు, గొప్ప నిర్మాతను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Harish Shah news
నిర్మాత హరీశ్ షా- రామ్ తేరే కిత్నే నామ్ సినిమా

'ధన్ దౌలత్', 'జల్జాలా', 'అబ్ ఇన్సాఫ్ హోగా' తదితర చిత్రాలకు హరీష్ షా దర్శకత్వం వహించారు. వీటిలో ధర్మేంద్ర నటించిన 'జల్జాలా' చిత్రం(1988), రిషి కపూర్ -నీతు కపూర్ కలిసి నటించిన 'ధన్ దౌలత్' చిత్రాలు బాగా ప్రసిద్ధి చెందాయి. 'జాల్: ది ట్రాప్', 'రామ్ తేరే కిత్నే నామ్', 'కాలా సోనా' లాంటి ఎన్నో చిత్రాలను నిర్మించారు. ఈయన క్యాన్సర్‌పై 'వై మి' అనే షార్ట్ ఫిల్మ్‌ను నిర్మించారు, ఇది రాష్ట్రపతి అవార్డును గెలుచుకుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.