ETV Bharat / sitara

ఉర్రూతలూగించే స్వరాల జలపాతం.. దేవిశ్రీ ప్రసాద్‌ - దేవిశ్రీ ప్రసాద్ పుట్టినరోజు

ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ జన్మదినం నేడు(ఆగస్టు 2). ఈ సందర్భంగా అతడి జీవిత విశేషాలతో పాటు కెరీర్​ గురించి మీకోసం.

Happy Birthday RockStar Devi Sri Prasad
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్
author img

By

Published : Aug 2, 2020, 5:31 AM IST

స్వరాలతో నరాల్లో కరెంటు పుట్టించడం అతనికి మ్యూజిక్‌తో పెట్టిన విద్య..

మాటలతో పాటలు కట్టాలన్నా.. హార్ట్‌బీట్‌తో మెలోడీ పలికించాలన్నా అతను కావల్సిందే.

"అ అంటే అమలాపురం.. ఆ అంటే ఆహాపురం" అంటూ తెలుగు అక్షరాలతో ఐటెం స్టెప్పులేయించాడు.

తను ఎక్కుపెట్టిన ట్యూన్‌ ఏదైనా "ఇది ఆరడుగుల బుల్లెట్‌.." అంటూ ప్రేక్షకుల మదిలోకి దూసుకుపోవాల్సిందే.

"సరి గమ పదనిసా.." అంటూ తను గళం విప్పితే "ఇట్స్‌ టైమ్‌ టు పార్టీ నౌ.." అంటూ సినీ ప్రియులు థియేటర్లలో చిందులు తొక్కారు..

"రింగ రింగ.." అంటూ టాలీవుడ్‌లో దుమ్ములేపితే, "డింకచిక డింకచిక" అంటూ బాలీవుడ్‌ సైతం పూనకంతో ఊగిపోయింది.

క్లాస్, మాస్, రాప్, రాక్, ఫోక్‌ గీతమేదైనా సరే దేవిశ్రీ ప్రసాద్‌ చేతిలో పడిందంటే చాలు నిండైన ఎనర్జీతో సంగీత ప్రియులను సునామీలా ముంచేస్తుంది. అందుకే తరాల భేదమెరుగని స్వరంగా దేవిశ్రీ సంగీతం అందరికీ ఇంపుగా మరిపోయింది.

Happy Birthday RockStar Devi Sri Prasad
రాక్​స్టార్ దేవిశ్రీ ప్రసాద్

సంగీతం సృష్టించడం.. సరిగమలతో సరికొత్త ప్రయోగాలు చేయడం.. ఎప్పటికప్పుడు నిత్యనూతనమైన గీతాలతో అలరించడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ దాన్ని అవలీలగా చేసి చూపిస్తాడు దేవిశ్రీ ప్రసాద్‌. గీతానికి, సంగీతానికి సరికొత్త బాటలు చూపిన యువ సంగీత దర్శకుడతను. అలతి అలతి పదాలతో పాటల మాలలు కట్టగలడు. ముద్దు ముద్దు పలుకుల నుంచి సరికొత్త బాణీలు సృష్టించగలడు. సరిగమల్లో యవతరపు సువాసనలు చల్లి ఉత్సాహంతో ప్రేక్షకుల నరాలను ఉప్పొంగించగలడు. అందుకే దేవిశ్రీ పాట థియేటర్లో వినపడితే చాలు శివాలెత్తి ఆడుతారు సినీ ప్రియులు. కాలు కదపలేని ముసలవ్వలతో కూడా దుమ్ముదులిపే స్టెప్పులేయిస్తాడు. కేవలం గాయకుడిగా, సంగీత దర్శకుడిగానే గాక పాటల రచయితగా, డ్యాన్సర్‌గా, స్టేజ్‌ పెర్ఫార్మర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈరోజు అతడి 41వ పుట్టినరోజు. ఈ సందర్భంగా దేవిశ్రీ గురించి విశేషాలు తెలుసుకుందాం.

అత్త, మామల పేర్లలో సగం సగం

దేవిశ్రీ ప్రసాద్‌.. 1979 ఆగస్టు 2న తూర్పుగోదావరి జిల్లాలోని వెదురుపాకలో శాస్త్రీయ సంగీతానికి నెలవైన కుటుంబంలో గొర్తి సత్యమూర్తి, శిరోమణి దంపతులకు జన్మించాడు. దేవిశ్రీ ప్రసాద్‌ పేరు వెనుక చిన్న ఆసక్తికరమైన కథ ఉంది. దేవిశ్రీ తండ్రికి తన అత్తమామలంటే మంచి అభిమానం. అందుకే తన అత్తగారి పేరులోని దేవి, మామ ప్రసాద్‌రావు పేరులోని ప్రసాద్‌ను తీసుకొని దేవిశ్రీ ప్రసాద్‌గా నామకరణం చేశారు.

Happy Birthday RockStar Devi Sri Prasad
రాక్​స్టార్ దేవిశ్రీ ప్రసాద్

దేవిశ్రీ సంగీత గురువు మాండొలిన్‌ శ్రీనివాస్‌. ఆయన శిక్షణలోనే మాండొలిన్‌ వాయించడంలో నైపుణ్యం సంపాదించాడు. చిన్నతనం నుంచి సంగీత దర్శకుడు కావాలని కలలు కన్నాడు. అనుకున్నట్లుగానే అతి పిన్నవయసులో ఆ కలను నిజం చేసుకొని, తనలోని సంగీత కళను సినీ పరిశ్రమకు పరిచయం చేశాడు. 20 ఏళ్ల వయసులోనే 'దేవి'(1999) సినిమాతో సంగీత దర్శకుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టి మంచి విజయాన్ని అందుకున్నాడు. మ్యూజికల్‌గా ఇది మంచి హిట్‌ కావడం సహా అందులోని 'నీ నవ్వే నాగస్వరమే' పాటకు మంచి ఆదరణ లభించింది.

దేవిశ్రీ చికు ఛంఛం 'ఆనందం'

'దేవి'తో చిత్రసీమకు తన పేరును పరిచయం చేసిన దేవిశ్రీ.. 'ఆనందం'తో దాన్నొక నామంలా జపించేలా సంగీతంతో మాయచేశాడు. యువతరానికి "కనులు తెరిచినా కనులు మూసినా.." తన గీతాలే గుర్తుకుతెచ్చేలా "ఒక మెరుపు.."ల్లాంటి స్వరాల జల్లును కురిపించాడు. 'చికు ఛం.. చికు ఛంఛం.. ఒక నిమిషం ఆనందం' అంటూ ప్రేక్షకులతో థియేటర్లలో చిందులు వేయించాడు.

అక్కడి నుంచి 'కలుసుకోవాలని', 'ఖడ్గం', 'మన్మథుడు', 'వర్షం', 'వెంకీ' చిత్రాలతో వరుస మ్యూజికల్‌ హిట్లు అందుకున్నాడు. నిజానికి పలానా సంగీత దర్శకుడి పాటల్లో ఏది అత్యుత్తమం అంటే కొంచెం ఆలోచించైనా పలానా పలానా చిత్రాలను గుర్తుకు తెచ్చుకుంటాం. కానీ దేవిశ్రీ విషయంలో ఇది అసాధ్యమైన పని ఎందుకంటే తను అందించిన ప్రతి సినిమా మ్యూజికల్‌ హిట్టే వాటిలో నుంచి కొన్ని పాటలను ఎంపిక చేసుకోని చెప్పమంటే కడివెడు అమృతంలోంచి ఓ అత్యుత్తమ అమృత బిందువు తీయమన్నట్లే ఉంటుంది.

Happy Birthday RockStar Devi Sri Prasad
రాక్​స్టార్ దేవిశ్రీ ప్రసాద్

చిన్నపెద్దా.. హీరో ఎవరికైనా డీఎస్పీనే చిరునామా..

సాధారణంగా చిత్రసీమలోకి వచ్చిన వెంటనే ఓ యువ సంగీత దర్శకుడిని అగ్రకథానాయకుడి సినిమాకు ఎంపిక చేసుకోవాలంటే దర్శక, నిర్మాతలు కొంత వెనుక ముందు ఆలోచిస్తుంటారు. యువ హీరోల శైలికి తగ్గట్లు స్వరాలిచ్చినట్లు అగ్రహీరోలకు ఇవ్వలేడేమో అన్న భయం ఉంటుంది. కానీ దేవిశ్రీ దీనికి అతీతుడు. ఏ తరం కథానాయకుడితోనైనా తనదైన సంగీతంతో ఉర్రూతలూగించేలా స్టెప్పులేయిస్తాడు దేవిశ్రీ.

మెగాస్టార్ చిరంజీవితో 'శంకర్‌దాదా ఎంబీబీఎస్‌', 'అందరివాడు', 'శంకర్‌దాదా జిందాబాద్‌', 'ఖైదీ నెం.150', నాగార్జునతో 'మన్మథుడు', 'మాస్‌', 'కింగ్‌', 'ఢమరుకం', వెంకటేష్‌తో 'తులసి', 'నమో వెంకటేశ', బాలకృష్ణతో 'లెజెండ్‌', పవన్‌ కల్యాణ్‌తో 'జల్సా', 'గబ్బర్‌ సింగ్‌', 'అత్తారింటికి దారేది', 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌' లాంటి మంచి మ్యూజికల్‌ హిట్లు ఇచ్చాడు.

యువహీరోలు అల్లుఅర్జున్, జూ.ఎన్టీఆర్, ప్రభాస్, రామ్‌చరణ్, రామ్, నాగచైతన్య, నాని, రవితేజ, సిద్ధార్థ, రాజ్‌తరుణ్, బెల్లంకొండ శ్రీనివాస్, అల్లరి నరేష్‌ తదితరులందరి చిత్రాలకు చక్కటి సంగీతాన్నందించి మెప్పించాడు దేవిశ్రీ ప్రసాద్‌.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.