ETV Bharat / sitara

Arjun Sarja: ఘనంగా ఆంజనేయ ఆలయ ప్రారంభోత్సవం - అర్జున్​ ఆంజనేయ టెంపుల్​

ప్రముఖ కథానాయకుడు అర్జున్‌(Arjun Sarja) ఓ ఆలయానికి శ్రీకారం చుట్టారు. ఆంజనేయ స్వామిపై తనకున్న భక్తితో చెన్నై విమానాశ్రయానికి దగ్గరలో ఉన్న సొంత స్థలంలో ఆయన ఆలయాన్ని నెలకొల్పారు. ఇటీవలే ఈ ఆలయ ప్రారంభోత్సవ వేడుక ఘనంగా జరిగింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

Hanuman temple constructed by Arjun Sarja in Chennai to be opened to public soon
Arjun Sarja: ఘనంగా ఆంజనేయ ఆలయ ప్రారంభోత్సవం
author img

By

Published : Jul 7, 2021, 1:21 PM IST

'ఓకే ఒక్కడు', 'హనుమాన్‌ జంక్షన్‌', 'పుట్టింటికి రా చెల్లి' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు నటుడు అర్జున్‌ సర్జా(Arjun Sarja). ఆంజనేయస్వామికి పరమ భక్తుడైన ఆయన చెన్నైలో హనుమాన్‌ ఆలయాన్ని ఇటీవల నిర్మించారు. ఇటీవలే ఈ ఆలయ ప్రారంభోత్సవం వేడుకగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితుల ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

చెన్నై విమానాశ్రయానికి దగ్గరలో ఉన్న తన సొంత స్థలంలో అర్జున్‌ ఈ ఆలయాన్ని(Arjun Sarja Anjaneya Temple) నెలకొల్పారు. సుమారు 15 సంవత్సరాల క్రితమే ఈ మహత్తర కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న ఈ ఆలయంలో దాదాపు 35 అడుగుల ఎత్తైన హనుమాన్‌ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

ఇదీ చూడండి.. 'హనుమాన్'​​ ఆలయం నిర్మించిన అర్జున్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.