ETV Bharat / sitara

'టెనెట్​' సినిమాలో ఆఫర్.. ప్రాంక్​ కాల్ అనుకున్నా!

క్రిస్టోఫర్​ నోలన్​ 'టెనెట్​'తో హాలీవుడ్​ ఎంట్రీ ఇవ్వనున్న బాలీవుడ్​ నటి డింపుల్​ కపాడియా.. ఆసక్తికర విషయాన్ని తెలిపింది. ఇంతకీ అదెంటంటే?. డిసెంబరు 4న మన దేశంలోని థియేటర్లలో పలు ప్రాంతీయ భాషల్లో విడుదల కానుందీ చిత్రం.

Got audition call for Tenet, thought it was a prank: Dimple
'నోలన్​ చిత్రంలో అవకాశమంటే ప్రాంక్​ కాల్​ అనుకున్నా'
author img

By

Published : Dec 3, 2020, 9:16 PM IST

'టెనెట్​' సినిమా కోసం ఆడిషన్​లో పాల్గొనాలంటూ ఫోన్ వచ్చినప్పుడు, అది ప్రాంక్​ అనుకున్నానని సీనియర్ నటి డింపుల్ కపాడియా చెప్పింది. ఈ చిత్రంతోనే హాలీవుడ్​లోకి ఎంట్రీ ఇస్తోంది. డిసెంబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది 'టెనెట్'. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను పంచుకుంది డింపుల్.

"టెనెట్ ఆడిషన్​కు రావాలని గతంలో ఫోన్​ వచ్చింది. అది ప్రాంక్​ కాల్​ అనుకున్నా. క్రిస్టోఫర్​ నోలన్​ సినిమాలో నన్ను ఎందుకు ఎంపిక చేస్తారులే అనిపించింది. 'మీరు ఎక్కువగా ఊహించుకోవద్దు.. నేనిప్పుడు ఆడిషన్​ ఇచ్చే పరిస్థితిలో లేను' అని వాళ్లకు చెప్పా. అయితే దీన్ని చేయగలనా అనిపించి, ఆడిషన్​ ఇచ్చాను. ఆ తర్వాత వీడియోను చిత్రబృందానికి పంపాను. నోలన్​ ఇండియా వస్తున్నాడని.. అతని కోసం ఆడిషన్​ చేయమని చెప్పారు. ఆ దర్శకుడితో ఒక్క సినిమా చేయాలనే ఆశతో వెళ్లాను. ఆ తర్వాత సినిమాలో అవకాశం ఇచ్చారు. 'టెనెట్'​లో నటిస్తున్నానని తెలియగానే ఎంతో గొప్పగా అనిపించింది. ఈ విషయాన్ని..'అమ్మ.. నీ కూతురు ప్రపంచంలోని గొప్ప దర్శకులలో ఒకరితో పనిచేయబోతున్నా' అని నా తల్లికి చెప్పాను. ఇన్నేళ్లలో ఆమె ముఖంలో సంతోషకర నవ్వును చూశాను"

- డింపుల్​ కపాడియా, బాలీవుడ్​ నటి

'టెనెట్' డిసెంబరు 4న (శుక్రవారం) భారత్​లో విడుదల కానుంది. కరోనా సమయంలో థియేటర్లలో రిలీజ్​ అవుతోన్న భారీ బడ్జెట్​ హాలీవుడ్​ సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఇప్పటికే పలు దేశాల్లో విడుదలై, మన దేశంలో ప్రేక్షకుల్ని ఇప్పుడు పలకరించబోతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు నోలన్ భారత అభిమానులకు ఓ సందేశం ఇచ్చారు.

"హాయ్‌.. నేను 'టెనెట్‌' చిత్ర దర్శకుడైన మీ క్రిస్టోఫర్ నోలన్‌. భారతీయ అభిమానులకు ఓ విషయం చెప్పదలుచుకున్నా. మీరు రేపు 'టెనెట్‌' సినిమా చూడబోతున్నారు. మీకు ఈ అవకాశం రావటం పట్ల నాకు చాలా ఉత్కంఠగా ఉంది. ఈ సినిమా షూటింగ్ ముంబయిలోనూ జరిగింది. బాలీవుడ్ నటి డింపుల్ కపాడియాతో పనిచేయడం ఆనందం కలిగించింది. 'టెనెట్‌' బిగ్‌ స్క్రీన్‌పై విడుదల కాబోతుంది. సినిమా చూసి ఆనందించండి. మీకు కృతజ్ఞతలు"

-క్రిస్టోఫర్ నోలన్, దర్శకుడు

'టెనెట్' సినిమాలో రాబర్ట్​ ప్యాటిన్సన్, జాన్ డేవిడ్ వాషింగ్టన్, డింపుల్ కపాడియా, కెన్నెత్ బ్రానాగ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.