ETV Bharat / sitara

కరోనా కరుణిస్తే మా సినిమా రిలీజ్: 'పక్కా కమర్షియల్' టీమ్ -

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో పక్కా కమర్షియల్, కాతువక్కుల రెండు కాదల్, డీజే టిల్లు, అనేక్, ఖిలాడి, ఇళయారాజా కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన సంగతులు ఉన్నాయి.

gopichand pakka commercial
గోపీచంద్
author img

By

Published : Feb 2, 2022, 4:07 PM IST

Gopichand pakka commercial: మరో తెలుగు సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. గోపీచంద్ హీరోగా నటిస్తున్న 'పక్కా కమర్షియల్' చిత్రాన్ని మే 20న థియేటర్లలోకి తీసుకొస్తామని వెల్లడించారు. దానిని చెబుతూ బుధవారం ఓ పోస్టర్​ను విడుదల చేశారు. అయితే కరుణ కరుణిస్తేనే అంటూ క్యాప్షన్​ పెట్టి, ప్రస్తుత పరిస్థితులపై సైలెంట్​గా సెటైర్​ వేశారు!

gopichand pakka commercial movie
గోపీచంద్ పక్కా కమర్షియల్ మూవీ రిలీజ్ డేట్

కామెడీ ఎంటర్​టైనర్​గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన రాశీఖన్నా హీరోయిన్​గా నటిస్తోంది. మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. జేక్స్ బెజోయ్ సంగీతమందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, జీఏ 2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

kathuvakkula rendu kadhal movie: విజయ్ సేతుపతి-నయనతార-సమంత జంటగా నటిస్తున్న 'కాతువక్కుల రెండు కాదల్' రిలీజ్​ ఖరారైంది. ఏప్రిల్​లో ఈ రొమాంటిక్​ ఎంటర్​టైనర్​ను థియేటర్లలోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. టీజర్​ను ఈ నెల 11న రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్​ విడుదల చేశారు.

kathuvakkula rendu kadhal movie
కాతువక్కుల రెండు కాదల్ మూవీ

ఈ సినిమాకు అనిరుధ్ సంగీతమందిస్తుండగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ట్రై యాంగిల్​ లవ్​స్టోరీగా దీనిని తెరకెక్కించారు.

Ilayaraja news: మాస్ట్రో ఇళయరాజా కొత్త ప్రాజెక్టు గురించి ప్రకటన వచ్చింది. ఆయన చేస్తున్న 1422వ ప్రాజెక్టు ఇదేనంటూ ఓ పోస్టర్​ రిలీజ్ చేశారు. పూర్తి వివరాలు వాలంటైన్స్ డేన వెల్లడిస్తామని స్పష్టం చేశారు.

ilayaraja news
ఇళయారాజా

DJ Tillu trailer: 'డీజే టిల్లు' ట్రైలర్ వచ్చేసింది. సిద్ధు, నేహా శర్మ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సంక్రాంతికే విడుదల కావాల్సినప్పటికీ, కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఫిబ్రవరి 11న సినిమా రిలీజ్ చేస్తామని ఇటీవల చిత్రబృందం ప్రకటించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్​టైనర్​గా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. సితార ఎంటర్​టైన్​మెంట్స్​ పతాకంపై నాగవంశీ నిర్మించారు.

'ఆర్టికల్ 15' సినిమాతో ఆకట్టుకున్న ఆయుష్మాన్ ఖురానా-అనుభవ్ సిన్హా కాంబోలో తెరకెక్కుతున్న కొత్త సినిమా 'అనేక్'. ఇప్పుడు ఆ చిత్ర రిలీజ్ డేట్​ను ఖరారు చేశారు. మే 11న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు 'ఖిలాడి' నుంచి 'క్యాచ్ మీ' అంటూ సాగే పాటను ఫిబ్రవరి 5న రిలీజ్​ చేయనున్నారు. ఫిబ్రవరి 11న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

ayushmann khurrana anek release date
ఆయుష్మాన్ ఖురానా 'అనేక్' మూవీ
raviteja khiladi movie
ఖిలాడి మూవీ

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.