రాజ్మెహతా దర్శకత్వంలో అక్షయ్, కరీనా జంటగా తెరకెక్కుతోన్న 'గుడ్‌న్యూస్' సినిమా విడుదల తేదీ ఖరారైంది. తొలుత ఈ ఏడాది జులై 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. కాని డిసెంబరు 27న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు నిర్మాత కరణ్ జోహార్.
సల్మాన్ ఖాన్ 'దబాంగ్ 3' రిలీజ్ అయిన వారం తర్వాత ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో దిల్జిత్ దోసంగ్ , కియరా అడ్వాణీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కేప్ ఆఫ్ గుడ్ ఫిలింస్ కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనుంది.

2015లో గబ్బర్ ఈజ్ బ్యాక్ చిత్రంలో కలిసి నటించారు అక్షయ్-కరీనా. అక్షయ్ కేసరి చిత్రంతో, కరీనా వీరే ది వెడ్డింగ్‌తో చివరిగా ప్రేక్షకులను అలరించారు.