జేమ్స్‌బాండ్ మూడో చిత్రం 'గోల్డ్ ఫింగర్'లో టానియా గుర్తుందా? అందం, అభినయంతో టిల్లి మాస్టర్సన్ పాత్రలో ఆకట్టుకుంది టానియా. 77 ఏళ్ల వయసులో మార్చి 30న మృతి చెందారు. ఈ విషయాన్ని అధికారిక జేమ్స్‌బాండ్ ట్విట్టర్లో ధ్రువీకరించారు.
'గోల్డ్ఫింగర్లో టిల్లీ మాస్టర్సన్ పాత్రలో నటించిన టానియా మల్లెట్ ఇకలేరు అనే విషయం కలచివేస్తోంది. ఆమె కుటుంబానికి మా ప్రార్థనలు తోడుగా ఉంటాయి'.
-- జేమ్స్ బాండ్ అధికారిక ట్విట్టర్
చివరగా1976లో బుల్లితెరపై 'ద న్యూ అవెంజర్స్ షో' లో కనిపించిన టానియా ఆ తర్వాత నటించలేదు.