ETV Bharat / sitara

సీఎం కేసీఆర్​తో సినీరంగ ప్రముఖుల సమావేశం

kcr
kcr
author img

By

Published : Nov 22, 2020, 3:13 PM IST

Updated : Nov 22, 2020, 3:51 PM IST

15:10 November 22

సీఎం కేసీఆర్​తో సినీరంగ ప్రముఖుల సమావేశం

సీఎం కేసీఆర్​తో సినీరంగ ప్రముఖుల సమావేశం

తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. కొవిడ్ కారణంగా షూటింగులు ఆగిపోయి, థియేటర్లు మూసి వేయడం వల్ల జరిగిన నష్టం నుంచి కోలుకోవడానికి ప్రభుత్వపరంగా రాయితీలు, మినహాయింపులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. చిత్ర పరిశ్రమ ప్రముఖులు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. కొవిడ్ కారణంగా జరిగిన నష్టాన్ని వివరించారు. ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరారు. 

సినీ ప్రముఖుల విజ్ఞప్తులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రానికి పరిశ్రమలు తరలిరావడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నదని... అలాంటిది ఉన్న పరిశ్రమను కాపాడుకోకపోతే ఎలా సీఎం వ్యాఖ్యానించారు. దేశంలో ముంబయి, చెన్నైతోపాటు హైదరాబాద్‌లోనే పెద్ద సినీ పరిశ్రమ ఉందన్నారు. కొవిడ్ కారణంగా సినీ పరిశ్రమకు ఇబ్బంది కలిగిందని.. ప్రభుత్వ పరంగా సినీ పరిశ్రమను ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. త్వరలోనే సినీ హీరో చిరంజీవి ఇంట్లో మరోసారి సమావేశమై... సినిమా పరిశ్రమ అభివృద్ధిపై మరింత విస్తృతంగా చర్చించాలని నిర్ణయించారు. 

జీహెచ్ఎంసీ ఎన్నికల తెరాస మేనిఫెస్టోలోనూ సినిమా పరిశ్రమకు సంబంధించిన అంశాలను చేరుస్తామని సీఎం తెలిపారు. ఈ భేటీలో సీఎస్​ సోమేశ్​ కుమార్​, ప్రముఖ సినీ హీరోలు చిరంజీవి, నాగార్జున, ఫిలిం ఛాంబర్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నారాయణ్ దాస్ నారంగ్, కెఎల్ దామోదర్ ప్రసాద్, నిర్మాతల సంఘం అధ్యక్షుడు సి.కల్యాణ్, డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి, నిర్మాత నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

ఇదీ చదవండి : 'ప్రశాంతతతోనే ఆర్థికాభివృద్ధి... తెరాసతోనే అది సాధ్యం'

Last Updated : Nov 22, 2020, 3:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.