ETV Bharat / sitara

'గతం' కోసం ఆరాటం.. విముక్తికై పోరాటం! - క్రైమ్​ థ్రిల్లర్ ట్రైలర్లు

సైకో నేపథ్యంతో క్రైమ్ థ్రిల్లర్​గా తెరకెక్కిన చిత్రం 'గతం'. అమెజాన్ ప్రైమ్ వేదికగా నవంబర్ 6న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్​ను రిలీజ్ చేసింది చిత్రబృందం.

Gatham_Trailer
'గతం' కోసం ఆరాటం..విముక్తికి పోరాటం!
author img

By

Published : Oct 30, 2020, 5:49 PM IST

సైకో నేపథ్యంతో సాగే ఎన్నో చిత్రాలు ఇప్పటికే తెలుగు ప్రేక్షకులను అలరించాయి. తాజాగా అదే జోనర్‌లో మరో సరికొత్త సినిమా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమైంది. 'గతం' అనే పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్‌ 6న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ప్రేక్షకులను అలరించనుంది. కిరణ్‌ కొండమడుగుల దర్శకత్వం వహించిన ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌లో భార్గవ్‌, రాకేశ్‌, పూజిత ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా ప్రేక్షకులతో పంచుకుంది.

సైకో నుంచి బయటపడతారా?

ఓ ప్రమాదంలో గతం మర్చిపోయిన రిషికి.. అతిథి అనే అమ్మాయి దగ్గరవుతుంది. అయితే తన జీవితానికి సంబంధించిన ఎన్నో ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ రిషి తన ప్రేయసి అతిథితో కలిసి కారులో ఓ ప్రాంతానికి ప్రయాణమవుతాడు. మార్గ మధ్యంలో కారు పాడైపోవడం వల్ల అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి వీరిద్దరికీ తన ఇంట్లో షెల్టర్‌ ఇస్తాడు. అక్కడికి వెళ్లాక సదరు వ్యక్తి సైకో అని రిషి-అతిథికి అర్థమవుతుంది. అంతేకాకుండా తాను గతం మర్చిపోవడానికి ఆ వ్యక్తే కారణమని రిషికి తెలుస్తుంది. మరి రిషి-అతిథి సైకో బారి నుంచి ఎలా బయటపడ్డారు? రిషి గతం మర్చిపోవడానికి గల కారణమేమిటి? అనేది తెలియాలంటే 'గతం' చిత్రం చూడాల్సిందే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి:''పలాస' చిత్రంతో వరుసగా ఆఫర్లు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.