'కేజీఎఫ్ ఛాప్టర్1' చిత్రంతో దేశమంతా విశేషాదరణ పొందాడు హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్. అయితే ప్రస్తుతం ఆ సినిమా కొనసాగింపుగా 'కేజీఎఫ్ ఛాప్టర్2' తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఖరారు కావటం వల్ల అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది. ఈ ఏడాది అక్టోబరు 23న ప్రపంచవ్యాప్తంగా రీలీజ్ చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది.
తొలుత షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. అయితే చిత్రీకరణ విషయంలో రాజీ పడకుండా సన్నివేశాలను తెరకెక్కించడం, ప్రోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల ఆలస్యమవుతోందని సమాచారం.
కేజీఎఫ్‌ను ఎవరు దక్కించుకుంటారు?
గరుడను చంపడానికి కేజీఎఫ్‌లోకి అడుగుపెట్టిన రాఖీ.. ఆ తర్వాత దాన్ని ఎలా సొంతం చేసుకున్నాడు? కేజీఎఫ్‌ను దక్కించుకోవడానికి ప్రయత్నించిన రాజేంద్ర దేశాయ్, కమల్, గురు పాండ్యన్, ఆండ్రూస్‌లను ఎలా ఎదుర్కొన్నాడు? తన తమ్ముడి మరణవార్త తెలిసిన అధీర ఏం చేశాడు?.. గరుడ చనిపోయాడన్న వార్త తెలిసి ఇనాయత్ ఖలి దేశంపై దండెత్తడానికి ఎలాంటి ప్రణాళికలు వేశాడు?.. కేజీఎఫ్‌ను దక్కించుకున్న రాఖీని అంతం చేయడానికి భారత ప్రభుత్వం ఏం చేసింది?.. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు 'కేజీఎఫ్2'లో సమాధానం లభించనుంది.
- — Yash (@TheNameIsYash) March 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
— Yash (@TheNameIsYash) March 13, 2020
">— Yash (@TheNameIsYash) March 13, 2020
శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి కథానాయిక. బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ ప్రతినాయకుడిగా అధీర పాత్రలో కనిపించనున్నాడు. ప్రధానిగా రవీనా టాండన్ నటిస్తుండగా, ఓ కీలక పాత్రలో తెలుగు నటుడు రావు రమేశ్ కనిపించనున్నాడు. హోంబాలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చూడండి.. నరాచి నుంచి రాఖీ భాయ్ వచ్చేశాడు..