మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'వాల్మీకి'. నాచురల్ స్టార్ నాని ప్రధానపాత్రలో వస్తోన్న సినిమా 'గ్యాంగ్‌లీడర్'. ఈ రెండు మూవీలపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే వరుణ్, నానిలకు బాక్సాఫీస్ వద్ద పోటీ తప్పేలా లేదు.
ఈ రెండు చిత్రాలు విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్నాయి. టీజర్స్ చూస్తే ఆ విషయం స్పష్టమవుతోంది. విలక్షణ దర్శకుడిగా పేరున్న విక్రమ్ కె కుమార్ ఫన్ రివేంజ్ స్టోరీతో గ్యాంగ్‌లీడర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంతో మరో హిట్ ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నాడు నాని.
- \" class="align-text-top noRightClick twitterSection" data="\">\
'గబ్బర్ సింగ్' ఫేం హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా 'వాల్మీకి' వస్తోంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ ఆసక్తికరంగా ఉంది. వరుణ్ మాస్ లుక్‌తో ఆకట్టుకున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో భారీ హిట్ రాబోతోందని ప్రేక్షకులు భావిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఈ రెండు చిత్రాలు సెప్టెంబర్ 13నే విడుదల కానున్నాయి. 'గ్యాంగ్ లీడర్' చిత్రబృందం ఒక వారం క్రితం విడుదల తేదీ ప్రకటించగా, నిన్న విడుదలైన వాల్మీకి టీజర్లో వరుణ్.. మూవీ విడుదల తేదీని ప్రకటించారు. ఫలితంగా సెప్టెంబర్ 13న బాక్సాఫీస్ పోరు రసవత్తరంగా మారింది.
ఇవీ చూడండి.. ప్రఖ్యాత 'గ్రాండ్ రెక్స్' థియేటర్లో 'సాహో'