నేచురల్ స్టార్ నాని, ప్రముఖ దర్శకుడు విక్రమ్ కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'గ్యాంగ్ లీడర్'. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్(సీవీఎం) నిర్మిస్తున్నారు. సోమవారం ఈ సినిమాలోని మూడో పాటను విడుదల చేయబోతున్నారు.
'నిన్ను చూసే ఆనందంలో' అంటూ సాగే ఈ గీతాన్ని మెలోడీగా రూపొందించాడు సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు శ్రోతల్ని ఆకట్టుకున్నాయి.
సినిమాను సెప్టెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ చిత్రంలో 'ఆర్‌ఎక్స్ 100' ఫేమ్ కార్తికేయ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.
ఇవి చూడండి.. రెండ్రోజుల్లో రూ.200 కోట్లు.. సాహో సునామీ