ఇజ్రాయెల్-పాలస్తీనా దేశాల మధ్య మరోసారి గొడవలు తారాస్థాయికి చేరాయి. ఈ ఘటనలో చాలామంది మృత్యువాత పడ్డారు. తాజాగా ఈ విషయంపై స్పందించిన 'వండర్ ఉమెన్' ఫేమ్ గాల్ గాడోట్.. తన హృదయం ముక్కలైందని తెలిపింది. ఇందుకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్ట్ పెట్టింది. అయితే ఈ పోస్ట్‌పై కొందరు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇజ్రాయెల్ డిఫెన్స్‌లో కొంతకాలం పనిచేసిన మీరు.. ఆ దేశం తరఫునే మాట్లాడుతున్నారు అంటూ కామెంట్లు చేశారు.
"నా హృదయం ముక్కలైంది. నా దేశం యుద్ధాన్ని ఎదుర్కొంటోంది. నా కుటుంబం, స్నేహితులు, నా దేశ ప్రజల పట్ల నాకు ఆందోళనగా ఉంది. చాలా కాలాంగా ఇలా జరుగుతూనే ఉంది. బాధితుల కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నా. ఇది ఇంతటితో ముగియాలని కోరుకుంటున్నా. ఇజ్రాయెల్, పొరుగు దేశం గొడవల నుంచి బయటికి రావాలి. ఇరుదేశాల మధ్య శాంతి స్థాపనకై, గొడవల పరిష్కారానికై నాయకులు ముందుకు రావాలని భావిస్తున్నా. మంచి రోజుల కోసం ప్రార్థిస్తున్నా" అంటూ పోస్ట్ చేసింది గాడోట్.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
అయితే దీనిపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. "మీరు మీ ఇజ్రాయెల్ దేశం తరఫున మాట్లాడినట్లు ఉంది" అని మండిపడుతున్నారు. ఇజ్రాయెల్ దేశం పేేరు తీసి.. పాలస్తీనాను పొరుగుదేశం అని పేర్కొనడం పట్ల విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో తన కామెంట్ సెక్షన్‌ను ఆఫ్ చేసుకుంది గాడోట్.
ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మూడు రోజులుగా ఇరుపక్షాలూ దాడులు కొనసాగిస్తున్నాయి. గురువారం తెల్లవారుజామున గాజాపై సైనిక దాడులతో విరుచుకుపడింది ఇజ్రాయెల్. ఈ క్రమంలో హమాస్‌కు చెందిన 10మంది సీనియర్ సైనికాధికారులు మృతిచెందారు. దీనిని ప్రతిఘటిస్తూ.. ఇజ్రాయెల్ నగరాలపై హమాస్ సభ్యులు రాకెట్లు ప్రయోగించినట్టు తెలుస్తోంది.