ETV Bharat / sitara

ఎన్టీఆర్, ఇంటర్వెల్​ వరకు​ మాట్లాడని సినిమా అదొక్కటే!

'రామాయణం'లో బాలనటుడిగా చేసిన ఎన్టీఆర్, సీత పాత్రధారికి లవ్​ లెటర్​ రాయడం.. నటుడిగా జపాన్​లోనూ గుర్తింపు తెచ్చుకోవడం.. తనతో పనిచేసిన దర్శకులను ప్రత్యేక పేర్లతో పిలవడం.. ఇలా ఎన్టీఆర్​ జీవితంలో ఆసక్తికర విషయాలెన్నో.. వాటిని మీరు చదివేయండి.

FULL DETAILS OF JR.NTR LIFE, CARREER
ఎన్టీఆర్
author img

By

Published : May 20, 2021, 2:01 PM IST

సినీ పరిశ్రమలో నట వారసులు చాలా మంది ఉన్నారు. కానీ, తాను వారసుడిని కాదు.. తాతకు మనవడిని అంటారు. 'కూచిపూడికైనా.. కుంగ్‌ఫూలకైనా, క్యాట్‌వాక్‌కైనా దేనికైనా అతడు రెడీ'.. నూనుగు మీసాల వయసులోనే స్టార్‌డమ్‌.. బ్లాక్‌బస్టర్‌ విజయాలను ఆస్వాదించేలోపే పరాజయాలు.. తాను 'చూడడానికి కరెంట్‌ వైర్‌లా సన్నగా కనిపించినా.. టచ్‌ చేస్తే ఆ షాక్‌ మాత్రం సాలిడ్‌'గా ఉంటుంది. ఎందుకంటే ఆ పేరుకున్న పవర్‌ అలాంటిది. ఆ పేరే ఎన్టీఆర్‌.. ఇది 'శక్తి'మంతమైన పేరు... 'దమ్ము'న్న పేరు! అందరికీ తెలిసిన పేరు.. అందరూ 'మనవాడు' అనుకున్న పేరు. డ్యాన్స్‌లు, ఫైట్స్‌, నటన, సంభాషణలు ఇలా ఏదైనా సరే ఎన్టీఆర్‌ మాత్రమే చేయగలరని ప్రేక్షకులు అనుకొనేలా చేస్తారు. బుధవారం, ఎన్టీఆర్ 39వ పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..

  1. ఎన్టీఆర్‌ పదేళ్లప్పుడే కెమెరా ముందుకొచ్చారు. తాత పెద్ద ఎన్టీఆర్‌ నటించిన 'బ్రహ్మర్షి విశ్వామిత్ర'లో భరతుడి పాత్ర చేశారు.
  2. గుణశేఖర్‌ దర్శకత్వంలో వచ్చిన 'రామాయణం'లో రాముడిగా పూర్తిస్థాయి పాత్ర పోషించారు. ఆ సినిమా సెట్‌లో జూ.ఎన్టీఆర్‌ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు.
    NTR RAMAYANAM MOVIE NEWS
    రామాయణము సినిమాలో ఎన్టీఆర్
  3. సీతా పరిణయం సందర్భంగా శివ ధనుర్భంగం సీన్‌ తీసేందుకు సన్నాహాలు చేస్తుంటే, రాముడి పాత్ర పోషించిన ఎన్టీఆర్‌.. ముందుగానే శివ ధనస్సు విరిచేశారట.
  4. రామాయణం షూటింగ్‌ జరుగుతుండగా, లక్ష్మణుడి పాత్ర చేసిన పిల్లాడు సీత పాత్ర వేసిన అమ్మాయికి లవ్‌ లెటర్‌ రాశాడు. కానీ ఇవ్వలేదు. అయితే, ఆ లెటర్‌ రాయించింది రాముడు పాత్ర వేసిన జూ.ఎన్టీఆర్‌.
  5. ఎన్టీఆర్‌ హీరోగా నటించిన తొలి చిత్రం 'నిన్ను చూడాలని'. ఈ సినిమాకు రూ.3.5లక్షల రెమ్యునరేషన్‌ తీసుకున్నారట. ఆ మొత్తాన్ని తీసుకెళ్లి తన తల్లికి ఇచ్చారట.
  6. ఎన్టీఆర్‌ నటించిన 'బాద్‌షా' జపనీస్‌లో డబ్‌ అయి, అక్కడి ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శన జరిగింది. రజనీకాంత్‌ తర్వాత జపాన్‌లో గుర్తింపు తెచ్చుకున్న నటుడు తారక్‌.
    NTR BAADSHAH NEWS
    బాద్​షా సినిమాలో ఎన్టీఆర్
  7. ఎన్టీఆర్‌ తను పనిచేసే దర్శకులను ప్రత్యేకంగా పిలుస్తారు. వి.వి.వినాయక్‌ను వినయ్‌ అన్నా, రాజమౌళిని జక్కన్న, సురేందర్‌రెడ్డిని సూరి, వంశీని కటకటలా రుద్రయ్య అని ప్రేమగా పిలుస్తారు.
  8. 'చింతకాయల రవి' చిత్రంలో ఎన్టీఆర్‌ అతిథి పాత్ర పోషించారు. 'ఊపిరి' సినిమాలో నాగార్జునతో ఎన్టీఆర్‌ చేయాల్సింది. కానీ, 'నాన్నకు ప్రేమతో' సినిమా డేట్లు క్లాష్ కావడం వల్ల చేయలేకపోయారు.
  9. ఈటీవీలో వచ్చిన 'భక్త మార్కండేయ', స్టార్‌ మాలో ప్రసారమైన 'బిగ్‌బాస్‌' కార్యక్రమాలతో బుల్లితెరపై మెరిశారు.
  10. 'బాద్‌షా'లో తాత ఎన్‌.టి.రామారావు పేరును, కొడుకు అభయ్‌రామ్‌ పేరు కలిసేలా 'నాన్నకు ప్రేమతో..'లో అభిరామ్‌ అని తన పాత్రకు పేరు పెట్టుకున్నారు. అంతేకాదు, 'రభస', 'యమదొంగ' సహా చాలా సినిమాల్లో అక్కడక్కడా తాత ఎన్టీఆర్‌ హావభావాలు పలికించారు.
    NTR ARAVINDA SAMETHA MOVIE NEWS
    అరవింద సమేత సినిమాలో ఎన్టీఆర్
  11. 'ఆంధ్రావాలా', 'అదుర్స్‌', 'శక్తి' చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేయగా, 'జై లవ కుశ'లో త్రిపాత్రాభినయం చేశారు.
  12. సినిమా అంటే హీరో డైలాగ్‌లు, పంచ్‌లతో అదిరిపోవాలి. కానీ, ఇంటర్వెల్‌ వరకూ ఎన్టీఆర్‌ మాట్లాడని సినిమా 'నరసింహుడు'.
  13. రాజమౌళి దర్శకత్వంలో ఇప్పటివరకూ మూడు సినిమాల్లో నటించారు. 'స్టూడెంట్‌ నెం.1', 'సింహాద్రి', 'యమదొంగ' చేశారు. ఇప్పుడు 'ఆర్‌ఆర్‌ఆర్‌' చేస్తున్నారు. అది విడుదల కావాల్సి ఉంది.
  14. ఎన్టీఆర్‌ అదృష్ట సంఖ్య 9. అందుకే ఆయన వాహనాలకు 9 నెంబర్‌ ఉంటుంది. అంతేకాదు, ట్విట్టర్‌ ఖాతా కూడా 'తారక్‌ 9999'అని ఉంటుంది.
  15. ఎన్టీఆర్‌ ఆల్‌ టైమ్‌ ఫేవరెట్‌ చిత్రం 'దాన వీర శూర కర్ణ'.
  16. 'మాతృదేవోభవ' చిత్రంలోని 'రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే' పాట అంటే ఎన్టీఆర్‌కు ఎంతో ఇష్టం. తరచూ ఈ పాట వింటుంటారు.
  17. ఎన్టీఆర్‌కు వంట చేయడమంటే భలే ఇష్టం. వెజ్‌.. నాన్‌వెజ్‌.. రోటి పచ్చడి.. బిర్యానీ ఏదైనా వండేస్తారు.
    NTR SIXPACK
    సిక్స్​ప్యాక్​లో ఎన్టీఆర్
  18. రేపు ఏం జరుగుతుందనే దాని గురించి ఎన్టీఆర్‌ అస్సలు ఆలోచించరు. వర్తమానంలో బతికే మనిషి. ఎందుకంటే జీవితంపై గ్యారెంటీ లేదని అంటుంటారు. "నాకంతా తెలుసు' అనే ఆలోచనను పక్కన పెట్టి 'నాకేమీ తెలీదు' అనుకుంటే అంతా హ్యాపీనే. 'నాకుంది ఈ క్షణమే. ఆనందంగా గడిపేయాలి" అని చెబుతుంటారు.
  19. అభిమానులు గొడవ పడటం ఎన్టీఆర్‌కు అస్సలు ఇష్టం ఉండదు. మొదట దేశాన్నీ, తర్వాత తల్లిదండ్రులను, భార్య బిడ్డలను చివరిగా నటులను అభిమానించాలని ఎన్టీఆర్‌ చెబుతారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.