ETV Bharat / sitara

'ఎప్పటికీ నువ్వే నా ప్రేమ'.. సినీ తారల పోస్టులు - ప్రేమికుల దినోత్సవం

ప్రేమికుల దినోత్సవం రోజు సినీ తారలు తాము ప్రేమించే వారిపై అభిమానాన్ని కనబర్చారు. సామాజిక మాధ్యమాల వేదికగా తమ ప్రేమను వ్యక్తపరిచారు. సూపర్​స్టార్ మహేశ్ బాబు, టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ భార్య అనుష్క శర్మ సహా కరీనా కపూర్, మాధురీ దీక్షిత్, నితిన్, రాశీ ఖన్నా తమ ప్రేమను తెలియజేశారు.

From Anushka to Varun, unmissable V-Day posts from B-town celebs
"ఎప్పటికీ నువ్వే నా ప్రేమ".. సిని తారల పోస్టులు
author img

By

Published : Feb 14, 2021, 7:31 PM IST

టాలీవుడ్ సూపర్​స్టార్ మహేశ్ బాబు కూతురు సితార.. తన అమ్మ నమత్ర, నాన్న మహేశ్​లకు గ్రీటింగ్​ కార్డ్​ ద్వారా వాలెంటైన్స్​ డే శుభాకాంక్షలు తెలిపింది. దానికి బదులుగా మహేశ్.. "థ్యాంక్యూ సీతూ పాప. అందరికీ ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు" అని ఇన్​స్టాలో పోస్ట్​ చేశాడు.

బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్​ తన భర్త సైఫ్ అలీఖాన్, కొడుకు తైమూర్​లపై ఇన్​స్టాగ్రామ్​ వేదికగా ప్రేమను పంచుకుంది. "ఇలాంటి మీసంతో ఉన్నా.. నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటా ప్రియా. హ్యాపీ వాలెంటైన్స్ డే." అని సైఫ్​కు చెప్పింది. ఇక తన కొడుకు తైమూర్ అలీఖాన్ ఫొటో షేర్​ చేసిన కరీనా.. "నువ్వు నాలా మూతి పెట్టినందుకు కాదు.. నువ్వంటే నాకు ఎప్పటికీ ఇష్టం.. నువ్వు నా హృదయ స్పందన" అని రాసుకొచ్చింది.

హిందీ నటుడు రాజ్​ కుమార్ రావ్ కుడా తన ప్రేయసి పత్రలేఖపై ఇన్​స్టా వేదికగా ప్రేమను కురిపించాడు. "నువ్వు లేకుండా నా జీవితం అసంపూర్ణం. నన్ను నవ్విస్తున్నందుకు, పరిపూర్ణం చేసి, ఇంకా మెరుగ్గా తయారయ్యేలా కృషి చేస్తున్నందుకు కృతజ్ఞతలు. నా వల్ల కూడా నీకు సంతోషం లభిస్తుందని అనుకుంటున్నా." అని రాసుకొచ్చాడు.

"ప్రతిరోజు.. ప్రతిచోట.. నీకు ప్రేమ" అని వరుణ్​ ధావన్​ తన భార్య నటాషా దలాల్​కు చెప్పాడు.

టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్​ కోహ్లీపై తన ప్రేమను చాటుకుంది అతని భార్య, నటి అనుష్క శర్మ. "మనకు ఇదొక్కటే ప్రత్యేకమైన రోజు కాదు. అయినా చెప్పాలనుకుంటున్నా. ప్రతి రోజు, ఎప్పటికీ, ఆ తర్వాత కూడా.. నువ్వే నా ప్రేమ.

తన భర్త రాజ్​ కుంద్రాపై ప్రేమతో "అప్పటినుంచి ఇప్పటి వరకు మన నవ్వులు మారలేదు. ఐ లవ్​ యూ మై కుకీ." అని రాసింది బాలీవుడ్​ నటి శిల్పా శెట్టి.

బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్​ముఖ్ కూడా భార్య జెనీలియాపై తన ప్రేమను తెలుపుతూ వీడియో పంచుకున్నాడు. హిందీ చిత్రం 'సడక్' నుంచి 'తుమే అప్నా బనానే కీ కసమ్' అంటూ సాగే పాటను ఇద్దరూ పాడతూ కనిపించారు. ఆ పోస్ట్​లో "జెనీలియాపై శాశ్వత ప్రేమ" అని రాశాడు రితేష్.

"ప్రతిరోజు ప్రేమను వేడుకగా చేసుకోండి" అంటూ భర్త నేనేతో దిగిన ఫొటో పంచుకుంది బాలీవుడ్ అందాల తార మాధురీ దీక్షిత్.

'రంగ్​ దే' చిత్ర బృందం తరఫున ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు టాలీవుడ్​ నటుడు నితిన్.

నాకు వాలెంటైన్స్​ డే శుభాకాంక్షలు అంటూ తనకు తానే చెప్పుకుంది అందాల భామ రాశీ ఖన్నా. "నన్ను నేను ప్రేమించుకుంటున్నా.. ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు. అది అందమైన అనుభూతి కదా?" అని ట్వీట్ చేసింది.

"హ్యాపీ వాలెంటైన్స్​ డే" అంటూ ముద్దుగా దిగిన ఫొటో షేర్​ చేసింది నటి ఈషా రెబ్బా.

ఇదీ చూడండి: వాలెంటైన్స్​ డే: ప్రేమకు వయసు అడ్డు కాదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.