ETV Bharat / sitara

పింక్‌ టు వకీల్‌సాబ్‌ వయా 'నేర్కొండపార్వై' - Azith vakeelsaab

వేణు శ్రీరామ్​ దర్శకత్వంలో పవన్​కల్యాణ్​ హీరోగా నటించిన 'వకీల్​సాబ్​' ఏప్రిల్‌ 9న విడుదల కానుంది. మహిళా సాధికారతే ప్రధానాంశంగా తెరకెక్కిన బాలీవుడ్​ సినిమా 'పింక్‌'కు రీమేక్‌గా ఈ చిత్రం రానుంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్‌ చేయగా.. అక్కడ కూడా ప్రశంసలు అందుకుంది. ఓ సారి ఈ చిత్రాల విశేషాల లుక్కేద్దాం.

vakeelsaab
వకీల్‌సాబ్
author img

By

Published : Apr 7, 2021, 8:02 PM IST

పవర్‌ స్టార్‌ పవన్‌కల్యాణ్‌.. థియేటర్‌లో స్క్రీన్‌పై ఈ పేరు చూసి ఈలలు వేయడం కోసం అభిమానులు కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు సరైన సమాధానం చెప్పేందుకు ఏప్రిల్‌ 9న ఆయన 'వకీల్‌సాబ్‌'గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కమర్షియల్‌ హంగులకు దూరంగా మహిళా సాధికారతే ప్రధానాంశంగా తెరకెక్కిన 'పింక్‌'కు రీమేక్‌గా ఈ సినిమా రానుంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్‌ చేయగా అక్కడా ప్రశంసలు అందుకుంది. కాగా, మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న 'వకీల్‌సాబ్‌' విశేషాలపై ఓ లుక్కేయండి..!

'పింక్‌' అలా..!

సమాజంలో మహిళల పట్ల కొంతమంది వ్యక్తులకు ఉన్న చులకన భావాన్ని, దానివల్ల స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపించిన చిత్రం 'పింక్‌'. సుజిత్‌ సర్కార్‌, రితేష్‌ షా రచించిన ఈ కథకు అనిరుద్‌ రాయ్‌ చౌదరి తన దర్శకత్వంతో ప్రాణం పోశారు. ఎలాంటి కమర్షియల్‌ హంగులు లేని ఈ కోర్టు రూమ్‌ డ్రామాలో అమితాబ్ బచ్చన్‌, తాప్సీ, కృతి కల్హరి, ఆండ్రియా ప్రధాన పాత్రలు పోషించారు. విభిన్నమైన కథా చిత్రాలతో తరచూ ప్రేక్షకుల్ని మెప్పించే అమితాబ్‌, తాప్సీ ఈ సినిమాలో భాగం కావడంతో ప్రారంభంలో దీనిపై ఓ మోస్తరుగా అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్‌ విడుదలయ్యాక అవి రెట్టింపయ్యాయి. కథతోపాటు సాగే రెండు పాటలు మినహాయించి ఇందులో ఎలాంటి రొమాన్స్‌, ఇతర కమర్షియల్‌ హంగులు ఉండవు. ఎక్కువ భాగం కథ కోర్టు రూమ్‌లోనే సాగుతోంది. అలాగే, బిగ్‌బి వయసు పైబడిన వ్యక్తిలా కనిపిస్తారు. ఆయనకు వివాహమైనట్లు చూపిస్తారు.. కానీ సతీమణి పాత్రకు అంత ఎక్కువ పరిధి ఉండదు. అలాగే కోర్టు సీన్లు.. బిగ్‌బి, తాప్సీల నటన హైలైట్‌గా నిలిచాయి. అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ.వందకోట్లు వసూలు చేసినట్లు సినీ విశ్లేషకుల అంచనా.

Vakeel Saab
పింక్​

'నేర్కొండపార్వై' ఇలా..!

కథ నచ్చితే ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధంగా ఉంటారు కోలీవుడ్‌ అగ్ర కథానాయకుడు అజిత్‌. అలా ఆయన చేసిన ప్రయోగాలు బాక్సాఫీస్‌ వద్ద సక్సెస్‌ అయ్యాయి కూడా. బాలీవుడ్‌లో 'పింక్‌' మంచి విజయం సాధించడంతో ఆ సినిమాని తమిళంలోనూ రీమేక్‌ చేయాలని భావించారు నిర్మాత బోనీకపూర్‌. ఇలాంటి కథకు అజిత్‌ అయితే చక్కగా సరిపోతాడని నిర్మాత ఆయనని సంప్రదించాడు. అలా వచ్చిందే 'నేర్కొండపార్వై'. కోలీవుడ్‌ ప్రేక్షకుల్ని మెప్పించే విధంగా కథలో కొన్ని స్వల్ప మార్పులు చేశారు దర్శకుడు హెచ్‌.వినోద్‌. శ్రద్ధాశ్రీనాథ్‌, అభిరామి వెంకటాచలం, ఆండ్రియా కీలకపాత్రలు పోషించారు. ఇందులో అజిత్‌ మధ్య వయస్కుడిగా, గర్భవతి అయిన భార్యను(విద్యాబాలన్‌) కోల్పోయిన భర్తగా కనిపిస్తారు. అతికోపం అనే మానసిక రుగ్మతతో ఇబ్బందిపడుతున్న వ్యక్తిగా అజిత్‌ని చూపించారు. సినిమా ప్రారంభంలో వచ్చే ఓ క్లబ్‌ సాంగ్‌, అజిత్‌-విద్యాల మధ్య వచ్చే ఓ పాట ఆకట్టుకునేలా ఉంటాయి. అలాగే అజిత్‌ స్టార్‌డమ్‌ని దృష్టిలో ఉంచుకుని రెండు ఫైట్‌ సీక్వెన్స్‌లు కూడా చిత్రీకరించారు. సుమారు 150 కోట్ల వరకూ ఈ సినిమా వసూలు చేసినట్లు అంచనా.

Vakeel Saab
నేర్కొండపార్వై

'వకీల్‌సాబ్‌' ఎలా..!

'పింక్‌', 'నేర్కొండపార్వై' విజయాలు అందుకున్న తరుణంలో 'వకీల్‌సాబ్‌' పేరుతో అదే కథను తెలుగులోకి రీమేక్‌ చేశారు. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ స్టార్‌డమ్‌ని దృష్టిలో ఉంచుకుని మూలకథలో ఎలాంటి మార్పులు చేయకుండా కొన్ని కమర్షియల్‌ హంగుల్ని ఇందులో చేర్చారు దర్శకుడు వేణు శ్రీరామ్‌. బాలీవుడ్‌, కోలీవుడ్‌లో చూపించని విధంగా ఇందులో పవన్‌ని యంగ్‌ లుక్‌లో చూపించారు. అలాగే పవన్‌-శ్రుతిహాసన్‌ల మధ్య ఓ లవ్‌ట్రాక్‌ ఉండనుంది. ట్రైలర్‌ చూస్తే ఫైట్‌ సీక్వెన్స్‌ కూడా భారీగా ఉన్నట్లే కనిపిస్తున్నాయి. మరోవైపు ‘పింక్‌’, ‘నేర్కొండపార్వై’లో లేని విధంగా పవన్‌కు వ్యతిరేకంగా వాదించే న్యాయవాది పాత్రలో ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ని తీసుకోవడం, కోర్టు రూమ్‌లో వాళ్లిద్దరి మధ్య జరిగే మాటల యుద్ధం చూసి ప్రేక్షకులు ఇప్పటికే ఈలలు వేస్తున్నారు. ఇక ఇందులో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు అందర్నీ ఆకట్టుకున్నాయి.

Vakeel Saab
వకీల్​సాబ్​

పవన్‌ అలా వచ్చారు...!

'నేర్కొండపార్వై' విడుదలకు ముందు ఆ సినిమా ట్రైలర్‌ని ఓ సారి బోనీకపూర్‌ నాకు పంపించారు. ఆ వీడియో చూస్తున్నంతసేపు హీరో పాత్రలో పవన్‌కల్యాణే నాకు కనిపించారు. ఆ ట్రైలర్‌ని నేను హరీశ్‌ శంకర్‌కు పంపించగా.. 'ఇది కల్యాణ్‌ గారికి కరెక్ట్‌గా సెట్‌ అవుతుంది' అని అన్నాడు. దాంతో పవన్‌తో తప్పకుండా ఈ సినిమా చేయాలనే బలం నాలో మరింత పెరిగింది. 'నేర్కొండపార్వై' విడుదలై.. హిట్టైన తర్వాత 'అల.. వైకుంఠపురములో..' షూట్‌ లొకేషన్‌కు వెళ్లి త్రివిక్రమ్‌ని కలిశా. ఈ సినిమా గురించి ఆయనకు చెప్పి పవన్‌ అపాయింట్‌మెంట్‌ ఇప్పించమని కోరాను. దానికి త్రివిక్రమ్‌ ఓకే అని ఓరోజు పవన్‌తో మీటింగ్‌ ఏర్పాటు చేయించారు. పవన్‌ని కలిసి కథ చెప్పాను. ఆయన వెంటనే ఓకే అన్నారు. ఆ తర్వాత దర్శకుడిగా వేణుశ్రీరామ్‌ని ఈ ప్రాజెక్ట్‌లోకి తీసుకున్నాం. 'పింక్‌' రైటర్స్‌, డైరెక్టర్స్‌, బోనీకపూర్‌, హరీశ్‌ శంకర్‌, త్రివిక్రమ్‌, వేణుశ్రీరామ్‌.. వీళ్ల వల్లే పవన్‌తో సినిమా చేయాలనే నా డ్రీమ్‌ తీరింది’’ అని దిల్‌రాజు చెప్పారు.

Vakeel Saab
వకీల్​సాబ్​

వకీల్‌సాబ్‌ విశేషాలు..
* హీరోయిజాన్ని చూపించే సన్నివేశాలు
* ఫైట్‌ సీక్వెన్స్‌లు
* యంగ్‌ లుక్‌లో పవన్‌ కల్యాణ్‌. పవన్‌-శ్రుతి లవ్‌ ట్రాక్‌
* నాలుగు పాటలు
* పవన్‌-ప్రకాశ్‌ మధ్య వాదోపవాదాలు
* నివేదా, అంజలి, అనన్య నటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.