హీరో గోపీచంద్ నటిస్తున్న క్రీడా నేపథ్యమున్న సినిమా 'సీటీమార్'. ఇటీవలే ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఇందులో కబడ్డీ కోచ్‌గా కనిపించనున్నాడీ హీరో. ఈ చిత్రంలో మాజీ హీరోయిన్ భూమిక కీలక పాత్రలో కనిపించనుందని టాక్. తమన్నా కథానాయికగా నటిస్తోంది. సంపత్‌నంది దర్శకత్వం వహిస్తున్నాడు.
'సీటీమార్' షూటింగ్ ప్రస్తుతం ఆత్రేయపురం పరిసర ప్రాంతంలో సాగుతోంది. మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. శ్రీనివాస్ చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
ఇదీ చదవండి: 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' చిత్రీకరణలో రజనీకి గాయాలు!