కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు లవర్‌బాయ్‌గా ఇమేజ్ తెచ్చుకున్న ఆయన.. ఆ తర్వాత మాస్ హీరోగా వరుస సినిమాలతో కెరీర్లో దూసుకెళ్తున్నారు. ఆయన నటించిన చిత్రాల్లో 'కాదల్ కొట్టై'ను (తెలుగులో 'ప్రేమ లేఖ') అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. అయితే ఈ సినిమా కథలాగే ఆయన నిజజీవితంలోనూ ఓ ప్రేమకథ ఉంది. అప్పట్లో గ్లామర్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న హీరా రాజాగోపాల్ను ఆయన ఘాడంగా ప్రేమించారట. ఆ రోజుల్లో వీరి లవ్‌ఎఫైర్ హాట్‌టాపిక్‌గా మారింది.
'కాదల్ కొట్టై'లో హీరా కూడా నటించింది. ఈ సినిమా షూటింగ్‌లోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ సమయంలో ఆమెకు అజిత్ లవ్‌లెటర్స్ కూడా రాసేవారట. ఆ తర్వాత 'తోడారమ్' సినిమా కోసం వీరిద్దరూ కలిసి పనిచేశారు. పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. కానీ ఆ తర్వాత విడిపోయారు. అందుకు కారణాలు కూడా తెలియరాలేదు. అయితే వీరి ప్రేమను హీరా తల్లి ఒప్పుకోలేదని సమాచారం. అనంతరం అజిత్, హీరోయిన్ షాలినీని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అజిత్.. హీరా ప్రవర్తన బాగోలేదని, ఆమె డ్రగ్స్‌కు బానిస అయిందని అన్నారు.
అజిత్ త్వరలోనే 'వాలిమై'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి.
ఇదీ చూడండి: Valimai: 'వాలిమై' ఫస్ట్‌లుక్.. సీబీ సీఐడి అధికారిగా అజిత్