మలయాళీ నటుడు దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. స్వప్న సినిమా సంస్థ నిర్మిస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో కథానాయకుడి పాత్రను పరిచయం చేస్తూ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు దర్శకనిర్మాతలు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
"ఈ సినిమాలో లెఫ్టినెంట్ రామ్‌గా కనిపించనున్నాడు దుల్కర్. శ్రీరాముడు, ప్రేమ కోసం ఆయన చేసిన యుద్ధం అజరామరం. అలాంటి మా లెఫ్టినెంట్ రామ్ ప్రేమను త్వరలోనే చూడబోతున్నారు" అని పేర్కొంది నిర్మాణ సంస్థ.
దీనిపై స్పందిస్తూ "ప్రతిక్షణం ధర్మం.. ధర్మం తప్పినప్పుడే యుద్ధం" అని రాసుకొచ్చారు దర్శకుడు హను. మరి ఈ రామ్ కథేంటి తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. వైజయంతీ మూవీస్ సంస్థ సమర్పిస్తోన్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. టైటిల్, నాయిక వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి : 'రాబర్ట్' ఓటీటీ రిలీజ్ డేట్.. 'ఏక్ మినీ కథ' సాంగ్