అగ్రహీరో నందమూరి బాలకృష్ణ కూడా సెట్లో అడుగుపెట్టేశారు. ఆయన నటిస్తున్న 'అఖండ' షూటింగ్.. హైదరాబాద్‌లో సోమవారం తిరిగి ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది. త్వరలో విడుదల తేదీనీ వెల్లడించే అవకాశముంది. చివరి షెడ్యూల్లో బాలయ్యపై కీలక సన్నివేశాలతో పాటు ఫైట్ సీక్వెన్స్‌ను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.
'అఖండ' నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్, పోస్టర్లు.. అభిమానుల్ని అలరించడమే కాకుండా సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి. బోయపాటి-బాలయ్య కాంబినేషన్లో వచ్చిన 'సింహా', 'లెజెండ్' చిత్రాలు బ్లాక్బస్టర్లుగా నిలవడం వల్ల ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇందులో బాలయ్య.. అఘోరా పాత్రలో కనిపించి, ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయనున్నారు. ఆయన సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. శ్రీకాంత్ ప్రతినాయకుడిగా చేస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నారు. బోయపాటి శీను దర్శకత్వం వహిస్తుండగా, మిర్యాల రవీందర్‌రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: