ETV Bharat / sitara

బాలీవుడ్ దర్శకుడి​ ఆరోగ్యం విషమం - nishikant kamat admitted

బాలీవుడ్​ దర్శకుడు నిషికాంత్ కామత్​ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.

Filmmaker Nishikant Kamat hospitalised
నిషికాంత్​
author img

By

Published : Aug 12, 2020, 9:13 AM IST

బాలీవుడ్​ ప్రముఖ దర్శకుడు నిషికాంత్​ కామత్ అనారోగ్యంతో హైదరాబాద్​లోని ఓ ఆసుపత్రిలో చేరారు. గత కొంతకాలంగా కాలేయ సమస్యతో పోరాడుతున్న ఆయన పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని సమాచారం. గతంలోనూ ఇదే సమస్య ఎదురవగా, చికిత్స అనంతరం కోలుకున్నారు. ఇప్పుడు మళ్లీ అది తిరగబెట్టినట్లు తెలుస్తోంది.

అజయ్​ దేవగన్,​ శ్రియ నటించిన 'దృశ్యం', ఇర్ఫాన్​ ఖాన్​ 'మదారి', జాన్ అబ్రహం 'ఫోర్స్', 'రాకీ హ్యాండ్సమ్​' లాంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు కామత్​.

నిషికాంత్ తీసిన 'డొంబివాలి ఫాస్ట్',​' లై భారీ' సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. మరాఠీలోనూ ఈయన చాలా చిత్రాలు తెరకెక్కించారు. నటుడిగానూ మెప్పించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.