ETV Bharat / sitara

తొలిసారి ఫిలింఫేర్ ఓటీటీ అవార్డుల ప్రదానం

ఓటీటీ వేదికగా విడుదలైన పలు చిత్రాలు, వివిధ వెబ్​సిరీస్​లు.. సినీ అభిమానులను ఈ ఏడాది బాగా అలరించాయి. ఈ నేపథ్యంలో.. ఇందులోని నటీనటులను వారి ప్రతిభను ప్రోత్సహించేందుకు మొట్టమొదటి సారిగా 'ఫిలిం ఫేర్​ ఓటీటీ అవార్డుల ప్రదానోత్సవం' జరిగింది.

author img

By

Published : Dec 20, 2020, 8:13 PM IST

Filmfare OTT Awards celebrations all actors participated
'బ్లాక్​ లేడీ'తో సందడి చేసిన ఓటీటీ తారలు

లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లు పూర్తిగా మూతపడడం వల్ల సినీ ప్రేమికులు ఓటీటీ బాటపట్టారు. దీంతో పలు చిత్రాలు ఓటీటీ వేదికగా విడుదలై ప్రేక్షకుల్ని అలరించాయి. మరోవైపు యాక్షన్‌, కామెడీ, థ్రిల్లింగ్‌.. ఇలా వివిధ విభాగాల్లో పలు వెబ్‌సిరీస్‌లూ ప్రేక్షకులను మెప్పించాయి.

ఈ నేపథ్యంలోనే ఓటీటీ వేదికగా విడుదలైన ఎన్నో వెబ్‌సిరీస్‌లు, అందులోని నటీనటుల కష్టాన్ని గుర్తిస్తూ.. వారి ప్రతిభను ప్రోత్సహించే విధంగా ఫిలింఫేర్‌లో ఈ ఏడాది నుంచి ఓటీటీ అవార్డ్స్‌ ఇవ్వనుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాదికిగాను మొట్టమొదటిసారిగా ఫిలింఫేర్‌ ఓటీటీ అవార్డుల ప్రదానోత్సవం శనివారం సాయంత్రం వేడుకగా జరిగింది. ఇందులో 'ఫ్యామిలీ మ్యాన్‌', 'పాతాల్‌ లోక్‌' సిరీస్‌లు ఎక్కువగా అవార్డులను సొంతం చేసుకున్నాయి. మరోవైపు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పలువురు నటీనటులు పాల్గొని సందడి చేశారు.

Filmfare OTT Awards celebrations all actors participated
ఫిలింఫేర్‌ ఓటీటీ అవార్డ్స్

విజేతల జాబితా ఇలా..

  • ఉత్తమ సిరీస్‌: పాతాల్‌ లోక్‌
  • ఉత్తమ దర్శకుడు: అవినాశ్‌ అరుణ్‌ అండ్‌ ప్రొసిత్‌ రాయ్‌ (పాతాల్‌ లోక్‌)
  • విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఉత్తమ సిరీస్‌: ది ఫ్యామిలీ మ్యాన్‌
  • ఉత్తమ దర్శకుడు (విమర్శకుల): కృష్ణ డీకే అండ్‌ రాజ్‌ నిడిమోరు (ది ఫ్యామిలీ మ్యాన్‌)
  • డ్రామా సిరీస్‌లో ఉత్తమ నటుడు: జైదీప్‌ హలావత్‌ (పాతాల్‌ లోక్‌)
  • డ్రామా సిరీస్‌లో ఉత్తమ నటి : సుస్మితాసేన్‌ (ఆర్య)

ఆర్య వెబ్​సిరీస్​కు గాను బాలీవుడ్​ నటి సుస్మితాసేన్ ​ డ్రామా సిరీస్​లో ఉత్తమ నటిగా పురస్కారాన్ని అందుకున్నారు. ఈ నేపథ్యంలో తన ఇన్​స్టాగ్రామ్​ ఖాతాలో ఓ వీడియో పోస్టు చేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు.

'ఆర్య' వెబ్​సిరీస్​లో సుస్మితాసేన్​

"ఈ పురస్కారం దక్కడం వల్ల నా పునరాగమనం విజయవంతమైంది. 'ఆర్య'తో మీ ప్రేమను నాకు పంచినందుకు ధన్యవాదాలు. ఈ బ్లాక్​ లేడీ ఈ రాత్రికి మా ఆర్య కుటుంబానిది. మా నాన్న పుట్టినరోజున ఈ బహుమతి అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఫిల్మ్​ ఫేర్​కు ధన్యవాదాలు​"

--సుస్మితా సేన్​, బాలీవుడ్​ నటి

హాట్​స్టార్​ ఓటీటీ వేదికగా విడుదలైన ఈ ఆర్య వెబ్​ సిరీస్​ ఘన విజయం సాధించింది. సందీప్​ మోదీ, రామ్​ మాధవానీ సంయుక్తంగా ఈ సిరీస్​ను తెరకెక్కించారు. చంద్రచూర్​ సింగ్​, నమితా దాస్​, సికందర్​ ఖేర్ లాంటి నటులు ఇందులో కీలకపాత్రలు పోషించారు.

  • డ్రామా సిరీస్‌లో ఉత్తమ నటుడు (విమర్శకుల): మనోజ్‌ వాజ్‌పేయీ (ది ఫ్యామిలీ మ్యాన్‌)
  • డ్రామా సిరీస్‌లో ఉత్తమ నటి (విమర్శకుల): ప్రియమణి (ది ఫ్యామిలీ మ్యాన్‌)
  • కామెడీ సిరీస్‌లో ఉత్తమ నటుడు: జితేంద్రకుమార్‌ (పంచాయత్‌)
  • కామెడీ సిరీస్‌లో ఉత్తమ నటి: మిథిలా పాల్కర్‌ (లిటిల్‌ థింగ్స్‌ సీజన్‌-3)
  • కామెడీ సిరీస్‌లో ఉత్తమ నటుడు (విమర్శకులు): ధ్రువ్‌ సెహగల్‌ (లిటిల్‌ థింగ్స్‌ సీజన్‌-3)
  • కామెడీ సిరీస్‌లో ఉత్తమ నటి(విమర్శకులు): సుముఖి సురేష్‌ (పుష్పావలి సీజన్‌-2)
  • డ్రామా సిరీస్‌లో ఉత్తమ సహాయ నటుడు: అమిత్‌ సద్‌ (బ్రీత్‌: ఇన్‌ టు ది షాడో)
  • డ్రామా సిరీస్‌లలో ఉత్తమ సహాయ నటి: దివ్యా దత్త (స్పెషల్‌ ఓపీఎస్‌)
  • కామెడీ సిరీస్‌లో ఉత్తమ సహాయ నటుడు: రఘువీర్‌ యాదవ్‌ (పంచాయత్‌)
  • కామెడీ సిరీస్‌లో ఉత్తమ సహాయ నటి: నీనా గుప్తా (పంచాయత్‌)
  • బెస్ట్‌ నాన్‌ ఫిక్షన్‌ ఒరిజినల్‌ (సిరీస్‌/స్పెషల్స్‌‌): టైమ్స్‌ ఆఫ్‌ మ్యూజిక్
  • ఉత్తమ కామెడీ(సిరీస్‌/స్పెషల్స్‌): పంచాయత్
  • ఉత్తమ సినిమా (వెబ్‌ ఒరిజినల్‌): రాత్‌ అకేలి హై

ఇదీ చూడండి:సినీ పరిశ్రమపై ఏపీ ప్రభుత్వ నిర్ణయం సరికాదు: సి.కల్యాణ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.