ETV Bharat / sitara

ఫిలింఫేర్ 2020: ఉత్తమ నటీనటులుగా 'రణ్​వీర్​, ఆలియా'

అసోం వేదికగా 65వ ఫిలింఫేర్ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. ఈ ఏడాది పురస్కారాల్లో ఉత్తమ చిత్రంగా 'గల్లీబాయ్' నిలిచింది. ఈ సినిమా మొత్తం 13 అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ నటీనటులుగా రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్ నిలిచారు.

author img

By

Published : Feb 16, 2020, 10:02 AM IST

Updated : Mar 1, 2020, 12:14 PM IST

Filmfare Awards 202
ఫిలింఫేర్ 2020: ఉత్తమ నటీనటులు 'రణ్​వీర్​-ఆలియా'

బాలీవుడ్ బిగ్గెస్ట్ ఈవెంట్​ 65వ ఫిలింఫేర్ అవార్డు వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. శనివారం గువాహటిలోని ఇందిరాగాంధీ అథ్లెటిక్ స్టేడియంలో కార్యక్రమం నిర్వహించారు. దీనికి పలువురు బాలీవుడ్ స్టార్​ సెలబ్రెటీలు హాజరయ్యారు. ఈ వేడుకకు ప్రముఖ నిర్మాత కరణ్​జోహర్​తో పాటు నటుడు విక్కీ కౌశల్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 2019లో బాలీవుడ్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచినవారికి అవార్డులు అందజేశారు.

ఉత్తమ చిత్రం గల్లీబాయ్...​

ఈ ఏడాది అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా 'గల్లీబాయ్'​ నిలిచింది. మొత్తం ఈ సినిమా 13 అవార్డులను సొంతం చేసుకుంది. ఈ అవార్డు కోసం చిచోరే, మిషన్ మంగల్, ఉరి, వార్ పోటీపడ్డాయి.

ఉత్తమ నటీనటుల విభాగంలో రణ్​వీర్​ సింగ్​, ఆలియా పురస్కారాలు సొంతం చేసుకున్నారు.

>> ఉత్తమ నటుడు కేటగిరీలో అక్షయ్ కుమార్ (కేసరి), ఆయుష్మాన్ ఖురానా (బాలా), హృతిక్​ రోషన్ (సూపర్ 30), షాహిద్ కపూర్ (కబీర్ సింగ్), విక్కీ కౌశల్ (ఉరి) పోటీపడ్డారు.

>> ఉత్తమ నటి రేసులో కంగనా రనౌత్ (మణికర్ణిక), కరీనా కపూర్ (గుడ్​ న్యూస్), ప్రియాంక చోప్రా (ద స్కై ఈజ్ పింక్), రాణీ ముఖర్జీ (మర్దానీ 2), విద్యా బాలన్ (మిషన్ మంగల్) నిలిచారు.

Filmfare Awards 2020
గల్లీబాయ్​ పోస్టర్​

ఉత్తమ చిత్రం క్రిటిక్స్ అవార్డు రేసులో ఆర్టికల్ 15, సోంచారియా సంయుక్తంగా పురస్కారం అందుకున్నాయి. ఈ విభాగంలో మర్ద్ కో దర్ద్ నహీ హోతా, ఫొటోగ్రాఫ్, ద స్కై ఈజ్ పింక్ పోటీపడ్డాయి. ఉత్తమ దర్శకురాలిగా జోయా అక్తర్ (గల్లీబాయ్)​ నిలిచింది.

65వ ఫిలింఫేర్ అవార్డు విజేతలు వీరే...

  • ఉత్తమ నటుడు - రణ్‌వీర్ సింగ్ (గల్లీబాయ్)
  • ఉత్తమ నటి - ఆలియా భట్ (గల్లీబాయ్)
  • ఉత్తమ చిత్రం - గల్లీ బాయ్
  • ఉత్తమ దర్శకుడు/దర్శకురాలు- జోయా అక్తర్ (గల్లీబాయ్​)
  • ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) - అనుభవ్​ సిన్హా (సోంచిరియా), అభిషేక్​ (ఆర్టికల్ 15)
  • ఉత్తమ నటుడు (క్రిటిక్స్) - ఆయుష్మాన్ ఖురానా (ఆర్టికల్ 15)
  • ఉత్తమ నటి (క్రిటిక్స్) - తాప్సీ పన్ను, భూమి పడ్నేకర్ (సాండ్​ కీ ఆంఖ్)
  • ఉత్తమ సహాయ నటుడు - సిద్ధాంత్ ఛతుర్వేది (గల్లీబాయ్​)
  • ఉత్తమ సహాయనటి - అమృతా సుభాష్ (గల్లీబాయ్)
  • ఉత్తమ సాహిత్యం - డివైన్, అంకుర్ తివారి (చిత్రం: గల్లీబాయ్, పాట: అప్నా టైమ్ ఆయేగా)
  • ఉత్తమ సంగీతం- గల్లీబాయ్, కబీర్ సింగ్
  • ఉత్తమ నేపథ్య గాయకుడు - అర్జిత్​ సింగ్ (చిత్రం: కళంక్, పాట: కళంక్ నహి)
  • ఉత్తమ నేపథ్య గాయని - శిల్పారావ్ (చిత్రం: వార్, పాట: ఘుంగ్రూ)
  • ఉత్తమ తొలి పరిచయం (నటుడు) - అభిమన్యు (మర్ద్ కో దర్ద్ నహీ హోతా)
  • ఉత్తమ తొలి పరిచయం (దర్శకుడు)- ఆదిత్య ధర్ (ఉరీ: ది సర్జికల్‌ స్ట్రైక్‌)
  • ఉత్తమ తొలి పరిచయం (నటి) - అనన్య పాండే (స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2, పతీ పత్నీ ఔర్​ వో)
  • ఉత్తమ మాటల రచయిత - విజయ్ మౌర్య (గల్లీబాయ్​)
  • ఉత్తమ యాక్షన్ - పాల్ జెన్నింగ్స్, ఓ సీ యంగ్, పర్వేజ్ షేక్, ఫ్రాంజ్ స్పిల్హాస్ (వార్)
  • బెస్ట్ స్క్రీన్‌ప్లే- రీమా కగ్తి, జోయా అక్తర్ (గల్లీబాయ్​)
  • బెస్ట్ కొరియోగ్రాఫర్- రెమో డిసౌజా (చిత్రం: కళంక్, పాట: ఘర్ మోరే పర్దేశియా)
  • బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ - కర్ష్ కాలే, ది సాల్వేజ్ ఆడియో కలెక్టివ్ (గల్లీబాయ్​)
  • బెస్ట్ కాస్ట్యూమ్ - దివ్య గంభీర్, నిధి గంభీర్ (సోంచిరియా)
  • బెస్ట్ సినిమాటోగ్రాఫర్ - జాయ్ ఓజా (గల్లీబాయ్​)
  • బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ - సుజన్నే కప్లాన్ (గల్లీబాయ్​)
  • బెస్ట్ ఎడిటింగ్ - శివకుమార్ (ఉరి: ది సర్జికల్ స్ట్రైక్)
  • బెస్ట్ వీఎఫ్ఎక్స్ - షెర్రీ బార్దా, విశాల్ ఆనంద్ (వార్)
  • బెస్ట్ సౌండ్ డిజైన్ - విశ్వదీప్ ఛటర్జీ, నిహార్ రంజన్ సామల్ (ఉరి: ది సర్జికల్ స్ట్రైక్)
  • జీవిత సాఫల్య పురస్కారం: రమేశ్​ సిప్పీ
  • ఎక్స్​లెన్స్​ ఇన్​ సినిమా: గోవింద
  • ఆర్డీ బర్మన్​ అవార్డ్​: సుష్వంత్​ సచ్​దేవ్ ​(ఉరి)

Last Updated : Mar 1, 2020, 12:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.