ETV Bharat / sitara

ఔను.. 'ఓటీటీ'పై మనసు పడుతున్నారు! - movies releasing on OTT Platform

లాక్​డౌన్​తో సినిమా థియేటర్లన్నీ మూతబడిన నేపథ్యంలో చిత్ర విడుదలలు వాయిదా పడ్డాయి. ఫలితంగా దర్శకనిర్మాతలు.. తన సినిమాలను ఓటీటీల్లో అందుబాటులోకి తీసుకోచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు.

Film producers are interesting to release films in OTT Platform
ఓటీటీ
author img

By

Published : Apr 29, 2020, 10:09 AM IST

ఇద్దరు హీరోలతో సినిమాలు తీయాలనుకుని కథలు సిద్ధం చేసుకున్న ఓ దర్శకుడు కొత్తగా వెబ్‌ సిరీస్‌ కోసం కలం పట్టారు. వరుసగా సినిమాల్ని నిర్మించడం కోసం ప్రణాళికలు రచించుకున్న ఓ అగ్ర నిర్మాణ సంస్థ.. ఇప్పుడు అమెజాన్‌ ప్రైమ్‌కు కంటెంట్‌ను అందించడమే లక్ష్యంగా పనుల్ని ప్రారంభించింది. సినిమాలు తప్ప ఇప్పట్లో వేరే ఆలోచనే లేదని చెబుతూ వచ్చిన హీరోలు.. ఇప్పుడు వెబ్‌ సిరీసుల్లో నటిస్తే ఎలా ఉంటుందా? అని ఆలోచిస్తున్నారు. - ఇలా చిత్ర పరిశ్రమలో ఇప్పుడు అందరి దృష్టీ ఓటీటీ (ఓవర్‌ ది టాప్‌) వేదికలపైనే పడింది.

ఔను...ఓటీటీపై మనసుపడుతున్నారు!

కరోనా ప్రభావంతో ఇప్పట్లో థియేటర్లు తెరచుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ అవి తీసినా, ప్రేక్షకుల రావడం మునుపటిలా ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. ఇలాంటి సమయంలో సినిమాలతో ప్రయాణం చేయడం కంటే, ప్రత్యామ్నాయం వైపు దృష్టి పెట్టడమే మేలని చిత్ర పరిశ్రమ నమ్ముతోంది. ఇప్పుడు సినిమాకు ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది ఓటీటీ వేదికలే. అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌, హాట్‌స్టార్‌, జీ5, ఆహా... ఇలా పలు ఓటీటీ వేదికలు ప్రేక్షకుడి దగ్గరికే వినోదాన్ని తీసుకొస్తున్నాయి. థియేటర్లు మూతపడినా సరే... ప్రేక్షకుడి వినోదానికి లోటు లేకుండా చేస్తున్నాయి. దాంతో చిత్ర పరిశ్రమలో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనేవరకు ఓటీటీ లక్ష్యంగా వెబ్‌ సిరీస్‌లు, సినిమాలు నిర్మించడం మేలనే అభిప్రాయానికొస్తున్నారు పలువురు టాలీవుడ్ దర్శకనిర్మాతలు. ఆ దిశగా పలు నిర్మాణ సంస్థలు ఇప్పటికే పనుల్ని ప్రారంభించాయి. లాక్‌డౌన్‌ పూర్తయిన వెంటనే చిత్రీకరణలు షురూ కాబోతున్నాయి.

విడుదల అందులోనే

నిన్నటివరకు సినిమాకు ఓటీటీ మార్కెట్‌ అనేది ఒక అదనపు ఆదాయ మార్గంగా ఉండేది. థియేటర్లలో విడుదలయ్యాక నెల రోజులకో, 50 రోజులకో ఓటీటీ వేదికల్లో ప్రదర్శితమయ్యేవి. ఆ హక్కుల రూపేణా నిర్మాతలకి అదనపు ఆదాయం సమకూరేది. అలాంటిది ఇప్పుడు నేరుగా ఓటీటీ వేదికల్లోనే సినిమాల విడుదలకు అడుగులు పడుతున్నాయి. థియేటర్లు మూతపడటమే అందుకు కారణం. లాక్‌డౌన్‌తో చాలా చిత్రాలు విడుదల కాకుండా ఆగిన విషయం తెలిసిందే. వాటిలో కొన్ని ఓటీటీలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 'అమృతరామమ్‌' అనే చిత్రం నేడు(బుధవారం) జీ5లో విడుదలవుతున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈ దారిలో మరికొన్ని సినిమాలు నడిచే అవకాశాలున్నాయి.

ఎక్కువ వ్యయంతో తెరకెక్కిన చిత్రాల కంటే, పరిమిత వ్యయంతో రూపొందిన సినిమాలపైనే దృష్టి సారించి బేరసారాలు సాగిస్తున్నాయి ఓటీటీ సంస్థలు. థియేటర్లు మూతపడి నెలన్నరవుతోంది. సినీ ప్రేమికులు భాషతో సంబంధం లేకుండా ఓటీటీల్లో సినిమాల్ని చూస్తున్నారు. భవిష్యత్తులో థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి. అంటే ఇంకొన్నాళ్లపాటు ప్రేక్షకుడు ఓటీటీలతోనే కాలక్షేపం చేయాల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడు ఓటీటీ మాధ్యమాలు కొత్త కంటెంట్‌ను సృష్టించడంపై దృష్టి పెట్టాయి. దర్శకులు, నిర్మాణ సంస్థలతోనూ సంప్రదింపులు జరుపుతున్నాయి. ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు వెబ్‌ సిరీస్‌ల నిర్మాణంపై దృష్టి పెడుతున్నట్టు ఇటీవల తెలిపారు. ఆయనకీ, కొన్ని ఓటీటీ ఛానళ్లకూ మధ్య చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఓటీటీల కోసం ఆయన వెబ్‌ సిరీస్‌లతో పాటు సినిమాలనూ నిర్మించబోతున్నట్టు సమాచారం.

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ నేతృత్వంలో నడుస్తున్న ఓటీటీ 'ఆహా' కోసం ఈ ఏడాది 20 వెబ్‌ సిరీస్‌లు నిర్మించనున్నట్టు తెలిపారు. "ఈ డిసెంబరులోపు 12 వెబ్‌ సిరీస్‌లు నిర్మించాలనుకున్నాం. కానీ ఆ సంఖ్యని 20కి పెంచబోతున్నాం. కరోనా ప్రభావంతో ప్రేక్షకులు ఓటీటీ మాధ్యమాలకు మరింతగా చేరువయ్యారు. ఆ డిమాండ్‌కు తగ్గట్టుగానే మేం నిర్మాణాలు చేపట్టబోతున్నాం. సినిమాల తరహాలో 1.30 గంట, 2 గంటలు నిడివి గల కొన్ని కథల్నీ 'ఆహా' కోసం సిద్ధం చేసి పెట్టాం. లాక్‌డౌన్‌ తర్వాత అనుమతుల్నిబట్టి చిత్రీకరణ చేపట్టబోతున్నాం" అని చెప్పారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ఒక ప్రముఖ కథానాయకుడు తాను చేయాలనుకున్న సినిమాల్ని పక్కనపెట్టి మరీ, వెబ్‌ సిరీస్‌లపై దృష్టి పెట్టేందుకు కథలు వింటున్నట్టు తెలుస్తోంది. వైజయంతీ మూవీస్‌, మంచు విష్ణు 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ, ఆర్కా మీడియా తదితర నిర్మాణ సంస్థలు వెబ్‌సిరీస్‌ల నిర్మాణంపై ఇప్పటికే అనుభవాన్ని సంపాదించాయి. అలాంటి సంస్థలన్నీ ఓటీటీల కోసం నిర్మాణాలపై దృష్టి పెట్టే అవకాశాలున్నాయి.

ఇదీ చూడండి : 'ఓటీటీ' ఫ్లాట్​ఫామ్స్ వైపు నిర్మాతల చూపులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.