దుర్గాశక్తి నాగ్‌పాల్... ఉత్తర్ప్రదేశ్ ఇసుక మాఫియాను ముప్పుతిప్పలు పెట్టి, మూడు చెరువుల నీళ్లు తాగించిన ఐఏఎస్ అధికారి. ఇప్పుడు ఆమె జీవిత చరిత్ర వెండి తెరపైకి రానుంది. ప్రముఖ నిర్మాతలు సునీర్ ఖేతర్పాల్, రాబీ గ్రివల్ కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలిపారు.
"ప్రస్తుత పరిస్థితుల్లో స్ఫూర్తినిచ్చే కథలను తెరపై చూపించాల్సిన అవసరం ఉంది. ధైర్యసాహసాలు కనబరిచే ఓ వీర వనిత కథ ఇది. దుర్గాశక్తి తన జీవితంలో ఎన్నోసార్లు ధైర్యసాహసాలను ప్రదర్శించారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఆమె గురించి ప్రతిఒక్కరికీ తెలియచేయటానికి ఇదే సరైన సమయం. ఈ చిత్రాన్ని రూపొందించడం ఎంతో గర్వించదగ్గ విషయం. "
-ఖేతర్పాల్, నిర్మాత.
ఇప్పటికే అజూర్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై బద్లా, కేసరి చిత్రాలను ఖేతర్పాల్ నిర్మించారు.
ఎవరీ దుర్గ..?
దుర్గాశక్తి నాగ్‌పాల్ 24 ఏళ్లకే ఐఏఎస్ అధికారి అయ్యారు. 2013లో యూపీ ఘజియాబాద్ ప్రాంతంలో ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపారు. అక్రమ ఇసుక వ్యాపారం చేయిస్తున్న అనేక మందిని అరెస్టు చేయించి, వారి వాహనాలను సీజ్ చేసి వార్తల్లో నిలిచారు.
ఇదీ చూడండి : ఉన్నావ్ ఘటనలో ఏడుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు