ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను సినీరంగ ప్రముఖులు కలిశారు. సినిమా షూటింగ్‌లు, థియేటర్ల ప్రారంభం విషయమై చిరంజీవి, నాగార్జున, అల్లుఅరవింద్, రాజమౌళి, సురేష్‌బాబు, దిల్‌రాజు, సి.కల్యాణ్, ఎన్.శంకర్, కొరటాల శివ సీఎంతో చర్చించారు. సినిమా చిత్రీకరణలు సాధ్యమేనా? సెట్స్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అనే విషయాలపై భేటీ సాగింది.
సినీపరిశ్రమ పునరుద్ధరణపై మార్గదర్శకాలు తయారుచేశామని మంత్రి తలసాని తెలిపారు. మార్గదర్శకాల అమలుపై మరో సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఇవీ చూడండి: కార్పొరేటర్ దంపతులకు జరిమానా వేసిన కేటీఆర్... ఎందుకంటే..?