ETV Bharat / sitara

'ఆ 20 నిమిషాలే ఇప్పుడు 20ఏళ్ల 'నువ్వేకావాలి''

ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్​లో తరుణ్​ హీరోగా కె. విజయ్​ భాస్కర్ దర్శకత్వం వహించిన సినిమా 'నువ్వే కావాలి'. ఈ చిత్రం నేటికి (అక్టోబర్ 13) 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర రచయిత త్రివిక్రమ్​​​ కొన్ని ఆసక్తికర సంగతులు పంచుకున్నారు.

author img

By

Published : Oct 13, 2020, 3:47 PM IST

Updated : Oct 13, 2020, 4:19 PM IST

Film Director Trivikram Srinivas taking about Nuvvekavali movie in view of 20years celebration
'ఆ 20 నిమిషాలే ఇప్పుడు 20ఏళ్ల 'నువ్వేకావాలి''
త్రివిక్రమ్​​

హీరో తరుణ్‌, రిచా జంటగా కె.విజయ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'నువ్వే కావాలి'. ఉషాకిరణ్‌ మూవీస్‌ నిర్మించిన ఈ చిత్రం 20 వసంతాలు(అక్టోబరు 13)న పూర్తి చేసుకుంది. తరుణ్‌-రిచాల నటన, విజయ్‌ భాస్కర్‌ టేకింగ్‌, త్రివిక్రమ్‌ రచనా శైలితో పాటు, సంగీత దర్శకుడు కోటి అందించిన స్వరాలు యువతనే కాదు, అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఈ సినిమా రచయిత త్రివిక్రమ్​​ ఈటీవీ భారత్​తో​ ​చిత్ర విశేషాలు పంచుకున్నారు.

"నువ్వేకావాలి సినిమా పేరు చెప్పగానే గుర్తొచ్చే మొదటి సంఘటన.. 20ఏళ్ల క్రితం రెయిన్​బో ల్యాబ్​లో రామోజీరావు గారికి 'నిరమ్​' సినిమా చూపించిన తర్వాత కారిడార్​లో నేను, రవికిశోర్​, రామోజీరావుగారు కలిసి 20 నిమిషాలు మాట్లాడుకున్నాం. ఆ 20నిమిషాలే ఇప్పుడు నువ్వేకావాలి చిత్రం అందరికి గుర్తుండుపోయేలా చేసింది. ఆ 20నిమిషాలు ఓ తీపిగుర్తు. 'నిరమ్'​ సినిమా ఎలా మార్చి తీస్తున్నారు అని రామోజీరావు గారు అడిగినప్పుడు దాని గురించి వివరించాం. 50రోజుల లోపు తీసిన సినిమా, 365 రోజుల కంటే ఎక్కువ ఆడిన సినిమా, 20ఏళ్ల తర్వాత గుర్తున్న చిత్రం. ఇప్పటిదాకా తెలుగు సినీ పరిశ్రమలో ఇంత ఆదర అభిమానం ఉన్న సినిమా గానీ, ప్రభావం చూపిన చిత్రం గానీ ఏది లేదని చెబుతుంటారు. ఆ సమయంలో ఇవేవి ఉహించలేదు. ఏదో పికినిక్​లా సరదాగా ఎంజాయ్​ చేస్తూ తీసిన సినిమా."

- త్రివిక్రమ్​ శ్రీనివాస్​

"నిరమ్'​ సినిమాలో ప్రధాన ఉద్దేశం తీసుకుని మిగతా సీన్స్​ అన్నీ మార్చి తీశాం. నాకు ఇది రెండో చిత్రం. అయితే యువతను ఆకర్షించే సినిమాను.. నిర్మాత, దర్శకులు పెద్దవాళ్లు అయి ఉండి కూడా యువతలా ఆలోచించి పూర్తి చేసిన చిత్రం ఇది. సాధారణంగా మట్లాడిన మాటల్నే అందులో ఉంచాం. సినిమా క్లైమాక్స్​ను రవికిశోషోర్​ బాగా నడిపించారు" అని త్రివిక్రమ్​ చెప్పారు.

వెనుక ఆయన ఉన్నారనే ధైర్యం..

'సినిమాలో ఏం చేసిన వెనుక రామోజీరావు గారు ఉన్నారనే ధైర్యం. ఆయన మా మీద పెట్టుకున్న విశ్వాసం. ఆ నమ్మకాన్ని మేం నిలబెట్టుకోగలిగాం. ఈ సినిమా 20 ఏళ్ల పాటు తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది. ఇంకా చాలా ఏళ్ల ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకుంటుంది. కొద్ది సినిమాలు మాత్రమే మన పాటు ట్రావెల్​ చేస్తాయి. అటువంటి సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఈ చిత్రంలో నేనూ భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా నాకు చాలా రకాలగా కీలకం. ఈ సినిమా టైటిల్​ను విజయభాస్కర్​ పెట్టారు. ఇది గొప్పవాళ్లంతా కలిసి తీసిన చిత్రం అందుకే ఇప్పటికీ అందరిని అలరిస్తుంది. ఈ సినిమాకు మాటలు రాసినందుకు చాలా సంతోషంగా ఉంది' ఈ సినిమా విశేషాలను పంచుకున్నారు త్రివిక్రమ్​.

ఇదీ చూడండి: 'నువ్వేకావాలి' సినిమాకు 20 ఏళ్లు.. రిచా ఆనందం

Last Updated : Oct 13, 2020, 4:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.