తెలుగు సినీ రంగంలో కరోనా కారణంగా అర్థాంతరంగా నిలిచిపోయిన సినిమా చిత్రీకరణలు పూర్తి చేశాకే కొత్త సినిమాలు మొదలుపెట్టాలని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి నిర్ణయించింది. షూటింగ్స్‌కు హాజరయ్యే నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఇతర సభ్యుల నుంచి నిర్మాణ సంస్థలు కరోనా టీకా తీసుకున్నట్లు నిర్ధారించాకే అనుమతి ఇవ్వాలని సూచించింది. సినిమా చిత్రీకరణలు, కొత్త సినిమాల ప్రారంభం, సినీ కార్మికుల ఆరోగ్యంపై నటీనటులు, దర్శకులు, నిర్మాతలతో సంయుక్త సమావేశం నిర్వహించిన వాణిజ్య మండలి... పలు తీర్మానాలను ప్రకటించింది.
సినీ రంగంలో ఉన్న ప్రతి వ్యక్తి ఒక్క డోసైనా టీకా వేయించుకోవాలని సూచించిన వాణిజ్య మండలి... 24 విభాగాల్లోని కార్మికుల ఆరోగ్య బీమా చేయించేలా ఫిల్మ్ ఫెడరేషన్ కృషి చేయాలని కోరింది. అలాగే ప్రతి సభ్యుడు సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తూ.. కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ సినిమా చిత్రీకరణలకు హాజరుకావాలని చలన చిత్ర వాణిజ్య మండలి సూచించింది.
ఇదీ చదవండి: Neena Gupta: 'సినిమా ఛాన్స్ కోసం రాత్రి ఉండమన్నాడు'