ETV Bharat / sitara

ఉద్ధమ్ సింగ్​గా విక్కీ

ఉరీ చిత్రంతో విజయం సాధించిన విక్కీకౌషల్.. స్వాతంత్ర్య పోరాట యోధుడు సర్దార్ ఉద్ధమ్ సింగ్​ పాత్రలో నటించనున్నాడు.

విక్కీ కౌశల్
author img

By

Published : Mar 4, 2019, 5:27 PM IST

మరో దేశభక్తి చిత్రానికి సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ నటుడ విక్కీకౌషల్. ఇటీవలే ఉరీ చిత్రంతో విజయం సాధించిన ఈ వర్థమాన నటుడు తాజాగా స్వాతంత్ర్యపోరాట యోధుడు సర్దార్ ఉద్ధమ్ సింగ్​ పాత్రలో నటించనున్నాడు. ఈ చిత్రానికి షుజిత్ సర్కార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం 2020లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

గతేడాది లస్ట్ స్టోరీస్, సంజూ, రాజీ, ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్ లాంటి చిత్రాలతో వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు విక్కీకౌషల్. వీటిలో రాజీ, ఉరీ సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. నటుడిగానూ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు విక్కి.
"ఈ బయోపిక్​లో విక్కీకౌషల్ సరిగ్గా సరిపోతాడు. సినిమా కోసం ప్రాణం పెట్టే నటుడు నాకు కావాలి. అంతే కాక పంజాబీ యోధుడి గాథలో పంజాబీ హీరోనే సరిపోలగలడు" -షుజిత్ సర్కార్ దర్శకుడు

ఇదీ కథ

ds
ఉద్ధమ్ సింగ్
1919 ఏప్రిల్ 13న జరిగిన జలియన్ వాలాబాగ్ దుర్ఘటనలో ఎంతో మంది చనిపోతారు. ఈ చర్యకు కారణమైన మైకేల్ ఓ డయ్యర్​ని 1940లో ఇంగ్లండ్​లో హతమారుస్తాడు ఉద్ధమ్ సింగ్. ఈ విధంగా జలియన్​ వాలా బాగ్ అసువులు బాసిన వీరుల త్యాగాలకు ప్రతీకారం తీర్చుకుంటాడు. ప్రస్తుతం ఈయన జీవితం ఆధారంగానే సినిమా తెరకెక్కుతుంది.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.