మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నటిస్తోన్న భారీ చిత్రం 'సైరా'. సురేందర్ రెడ్డి దర్శకుడు. ఇందులో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. తాజాగా సినిమా నుంచి ఓ ఎపిక్ వీడియోను విడుదల చేశాడు ఫర్హాన్ అక్తర్. ఇతడే చిత్ర హిందీ వెర్షన్ హక్కులు దక్కించుకున్నాడు.

" ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్, ఏఏ ఫిల్మ్స్ ,కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా విడుదల చేసిన సైరా నరసింహారెడ్డి ఎపిక్ వీడియో ఇది. దేశంలోని ఆల్‌టైం స్టార్ హీరోలు నటించిన భారీ చిత్రం".
--ఫర్హాన్ అక్తర్, సినీ నిర్మాత
-
Excel Entertainment and AA Films proudly present the EPIC #SyeRaaNarasimhaReddy in association with Konidela Productions starring the GREATEST Indian ensemble cast of all time.@ritesh_sid @AAFilmsIndia @excelmovies pic.twitter.com/9JOzzfp3xS
— Farhan Akhtar (@FarOutAkhtar) August 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Excel Entertainment and AA Films proudly present the EPIC #SyeRaaNarasimhaReddy in association with Konidela Productions starring the GREATEST Indian ensemble cast of all time.@ritesh_sid @AAFilmsIndia @excelmovies pic.twitter.com/9JOzzfp3xS
— Farhan Akhtar (@FarOutAkhtar) August 13, 2019Excel Entertainment and AA Films proudly present the EPIC #SyeRaaNarasimhaReddy in association with Konidela Productions starring the GREATEST Indian ensemble cast of all time.@ritesh_sid @AAFilmsIndia @excelmovies pic.twitter.com/9JOzzfp3xS
— Farhan Akhtar (@FarOutAkhtar) August 13, 2019
స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఈ రోజు (ఆగస్టు 14న) సాయంత్రం సైరా మేకింగ్ వీడియో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై నటుడు రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. తమిళ నటుడు విజయ్ సేతుపతి, కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్, టాలీవుడ్ ప్రముఖ నటుడు జగపతి బాబు, రవి కిషన్, నయనతార, తమన్నా ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబరులో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
ఇదీ చదవండి...త్వరలో పెళ్లిపీటలెక్కనున్న నీతి టేలర్