గతేడాది విడుదలై, తెలుగు ప్రేక్షకులను అలరించిన 'ఎఫ్2' చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. విక్టరీ వెంకటేశ్, మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ఈ మల్టీస్టారర్‌కు జాతీయ పురస్కారం లభించింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్వీట్ చేసింది.
-
#F2 #FunAndFrustration and Director @AnilRavipudi win awards in prestigious Indian Panorama for 2019. #F2 is the only film from Telugu.
— Sri Venkateswara Creations (@SVC_official) October 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Congratulations to @AnilRavipudi and Team #F2@VenkyMama @IAmVarunTej @tamannaahspeaks @Mehreenpirzada @ThisisDSP @SVC_official pic.twitter.com/HHYxX9bm8o
">#F2 #FunAndFrustration and Director @AnilRavipudi win awards in prestigious Indian Panorama for 2019. #F2 is the only film from Telugu.
— Sri Venkateswara Creations (@SVC_official) October 21, 2020
Congratulations to @AnilRavipudi and Team #F2@VenkyMama @IAmVarunTej @tamannaahspeaks @Mehreenpirzada @ThisisDSP @SVC_official pic.twitter.com/HHYxX9bm8o#F2 #FunAndFrustration and Director @AnilRavipudi win awards in prestigious Indian Panorama for 2019. #F2 is the only film from Telugu.
— Sri Venkateswara Creations (@SVC_official) October 21, 2020
Congratulations to @AnilRavipudi and Team #F2@VenkyMama @IAmVarunTej @tamannaahspeaks @Mehreenpirzada @ThisisDSP @SVC_official pic.twitter.com/HHYxX9bm8o
2019కు గాను వివిధ భాషలకు చెందిన 26 సినిమాలకు కేంద్ర సమాచార, ప్రసారశాఖ బుధవారం ఇండియన్ పనోరమ విభాగంలో అవార్డులను ప్రకటించింది. ఇందులో ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో అవార్డు దక్కించుకున్న ఏకైక తెలుగు సినిమాగా 'ఎఫ్2' నిలిచింది.
ఈ పురస్కారం లభించడంపై చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి సంతోషం వ్యక్తం చేశారు. వెంకటేశ్, వరుణ్ తేజ్, నిర్మాత దిల్ రాజుతో పాటు చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి క్యాన్సర్‌ను జయించిన సంజయ్ దత్