ప్రముఖ నిర్మాణ సంస్థ పీవీపీ బ్యానర్లో అడవి శేష్ హీరోగా రూపొందిన చిత్రం 'క్షణం'. 2016లో విడుదలైన ఆ సినిమా భారీ హిట్ సాధించింది. అయితే ఇప్పుడు అదే కాంబినేషన్లో మరో చిత్రం వస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ లోగోను విడుదల చేసింది చిత్రబృందం.
అడవి శేష్, రెజీనా ప్రధానపాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమాకు 'ఎవరు' అనే టైటిల్ను ఖరారు చేశారు. హీరో నవీన్ చంద్ర మరో ముఖ్యపాత్రలో కనిపించనున్నాడు. శ్రీచరణ్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి అబ్బూరి రవి మాటలు అందిస్తున్నాడు.
వెంకట్ రామ్జీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను ఆగస్టు 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇవీ చూడండి.. 'ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు'