అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ఎవరు'. ఇందులోని ఎన్నెన్నో కథలే చూసినా అంటూ సాగే లిరికల్ గీతం మంగళవారం విడుదలైంది. చిన్మయి ఆలపించిన ఈ పాట ఆకట్టుకుంటోంది. రెజీనా హీరోయిన్గా నటించింది. నవీన్ చంద్ర కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఆగస్టు 15న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
మర్డర్ మిస్టరీ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలో అవినీతి పోలీసు అధికారి పాత్రలో శేష్ నటించాడు. వెంకట్ రాంజీ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. పీవీపీ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతమందించాడు.
ఇది చదవండి: గుసగుస: మళ్లీ సినిమాల్లోకి పవన్..?
- " class="align-text-top noRightClick twitterSection" data="">