సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ కలిసి నటిస్తున్న చిత్రం 'టైగర్ 3'. మనీశ్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నారు. ఇందులో ఆయన పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ ఏజెంట్‌గా కనిపించనున్నారని సమాచారం. సల్మాన్.. ఇండియాకు చెందిన 'రా' ఏజెంట్‌గా చేస్తున్నారు.
అయితే ఇమ్రాన్ గతంలో ఎన్నడూ కనిపించని గెటప్‌తో ఇందులో నటించినున్నారట. అయితే వచ్చే నెలలో చిత్రీకరణను తిరిగి ప్రారంభించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల కోసం విదేశాల్లో షూటింగ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారట. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైనా, కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా మధ్యలోనే ఆగిపోయింది.
మరోవైపు కత్రినా కైఫ్ కూడా ఐఎస్ఐ ఏజెంట్ జోయగా నటిస్తోంది. ఆమె పాత్ర గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే వేచి చూడాల్సిందే. యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. 'రా' ఏజెంట్ బ్యాక్‌డ్రాప్‌తో సుమారు రూ.350 కోట్ల బడ్జెట్‌తో సినిమా తెరకెక్కిస్తున్నారు. గతంలో వచ్చిన 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందాహై'కి ఈ సినిమా సీక్వెల్.
ఇదిలా ఉంటే ఇమ్రాన్, అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించిన చిత్రం 'చెహ్రే' విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో అమితాబ్ న్యాయవాది వీర్ పాత్రలో నటించగా, ఇమ్రాన్ వ్యాపారవేత్త కరణ్ ఒబెరాయ్‌గా కనిపించనున్నారు. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రానికి రూమీ జాఫరీ దర్శకత్వం వహించారు.
ఇదీ చూడండి.. లంగాఓణీ అందాలతో 'దబాంగ్' బ్యూటీ