ETV Bharat / sitara

'చిత్ర' రాజకీయం... విడుదలపై సందిగ్ధం!

'పీఎం నరేంద్ర మోదీ' చిత్రం విడుదలపై సందిగ్ధం వీడలేదు. సినిమాను లోక్​సభ ఎన్నికలు ముగిసే వరకు నిలిపివేయాలా.. లేదా? అనే విషయంపై ఎన్నికల సంఘం తర్జనభర్జన పడుతోంది. సుప్రీంకోర్టులో సోమవారం ఈ కేసుపై విచారణ ముగిశాకే... ఈసీ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

'చిత్ర' రాజకీయం... విడుదలపై సందిగ్ధం!
author img

By

Published : Apr 7, 2019, 10:54 AM IST

'చిత్ర' రాజకీయం... విడుదలపై సందిగ్ధం!

ప్రధాని నరేంద్ర మోదీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన సినిమా 'పీఎం నరేంద్ర మోదీ'. ఈ చిత్ర విడుదలపై వివాదం కొనసాగుతోంది. ఏప్రిల్ 11న తొలి విడత పోలింగ్​ రోజే సినిమాను విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. అయితే... లోక్​సభ ఎన్నికలు ముగిసే వరకు చిత్రాన్ని నిలిపివేయాలని విపక్షాలు ఎన్నికల సంఘాన్ని కోరాయి. అదే అభ్యర్థనతో కాంగ్రెస్​ నేత ఒకరు సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. ఎన్నికల వేళ ఈ సినిమా విడుదలైతే అభ్యర్థుల పోటీపై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ కేసు విచారణ సోమవారం జరగనుంది.

తర్జనభర్జనలో ఈసీ..

చిత్ర విడుదలపై ఎన్నికల సంఘం సోమవారంలోపు స్పష్టత ఇచ్చే అవకాశం లేదు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు చిత్రంపై ఈసీ నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.
మోదీ బయోపిక్​ విడుదల నిర్ణయాన్ని 'సెంట్రల్​ బోర్డ్ ఆఫ్ ఫిలిం​ సర్టిఫికేషన్​' (సీబీఎఫ్​సీ)కే వదిలేసే విషయాన్నీ ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది.

ఎన్నికల నియమావళి...

7 విడతల్లో లోక్​సభ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత పోలింగ్​ ఏప్రిల్​ 11న మొదలుకానుంది. మార్చి 10నే ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది. అయితే సినిమాకు ఈ నిబంధన వర్తిస్తుందా అన్న విషయంపై సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన గత తీర్పులను పరిశీలిస్తుంది ఈసీ.

⦁ 'భోబిషైటర్​ భూత్' అనే చిత్ర విడుదలపై గతంలో సుప్రీం ఆదేశాలిచ్చింది. విడుదల చేసేముందు బంగాల్​ ప్రభుత్వాన్ని సినిమాను పూర్తి స్థాయిలో పరిశీలించాలని సూచించింది.

ఈసీకే వదిలేసిన న్యాయస్థానం...

బాంబే హైకోర్టు తాజాగా మోదీ బయోపిక్​ విడుదలకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్​పై నిర్ణయం ఎన్నికల సంఘం తీసుకుంటుందని వ్యాఖ్యానించింది.

AP Video Delivery Log - 0000 GMT News
Sunday, 7 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2326: Mexico Border AP Clients Only 4204777
Truck drivers face delays at US-Mexico border
AP-APTN-2251: MidEast Netanyahu No access Israel 4204775
Netanyahu plans to annex Israeli WBank settlements
AP-APTN-2233: Libya UN Envoy AP Clients Only 4204774
Salame: UN working 'day and night' for Libya peace
AP-APTN-2206: Venezuela Maduro AP Clients Only 4204773
'Stop the attacks,' Maduro urges opponents
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.