ఇప్పటికే తన మాతృభాషలో పలు పాటలు పాడిన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తొలిసారిగా తమిళంలో ఓ పాటను ఆలపించాడు. ప్రస్తుతం తమిళంలో అతడు నటిస్తున్న సినిమా 'హే సినామిక'. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కోసమే పాట పాడాడు సల్మాన్. దీనికి సంబంధించిన ఫొటోలను చిత్రబృందం పోస్ట్ చేసింది.
రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకెక్కతున్న ఈ సినిమాకు బ్రిండా దర్శకత్వం వహించగా.. హీరోయిన్గా కాజల్ అగర్వాల్, అదితి రావు హైదరీ నటిస్తున్నారు. సల్మాన్ ఈ సినిమాతో పాటు 'కురుప్','సెల్యూట్' చిత్రాల్లో నటిస్తున్నాడు.


ఇదీ చూడండి: రాంగ్‌రూట్‌లో దుల్కర్ సల్మాన్.. వదిలేసిన పోలీసులు