ETV Bharat / sitara

దృశ్యం 2: ఓటీటీలో కాదు.. థియేటర్లలోనే - Drishyam 2 telugu remake

వెంకటేశ్​, మీనా ప్రధానపాత్రల్లో నటిస్తున్న 'దృశ్యం 2' రీమేక్​ థియేటర్లలోనే విడుదలవుతుందని స్పష్టం చేశారు ఈ చిత్ర నిర్మాత సురేశ్​ బాబు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోందీ సినిమా.

Drishyam 2
దృశ్యం 2
author img

By

Published : Apr 23, 2021, 8:33 AM IST

మలయాళంలో విజయవంతమైన 'దృశ్యం 2' తెలుగులోనూ అదే పేరుతో తెరకెక్కుతోంది. ఇందులో వెంకటేశ్​​, మీనా ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. చిత్రీకరణ ఇటీవలే ప్రారంభించగా.. సినిమాలో వెంకటేశ్​ పాత్రకు సంబంధించిన షూటింగ్​ను పూర్తి చేసుకున్నట్లు చిత్రబృందం ఈ మధ్యే ప్రకటించింది. ఈ క్రమంలోనే ఈ రీమేక్​ను కరోనా ఉద్ధృతి కారణంగా ఓటీటీలో రిలీజ్​ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది. మే లేదా జూన్​లో స్ట్రీమింగ్​ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తాజాగా దీనిపై స్పందించిన ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన సురేశ్​ బాబు.. ఇవ్వన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు. సినిమా మొదటగా థియేటర్లోనే విడుదలవుతుందని, ఆ తర్వాత ఓటీటీలో రిలీజ్​కు సిద్ధమవుతుందని స్పష్టం చేశారు.

మాతృకను తెరకెక్కించిన జీతూ జోసెఫ్​ ఈ రీమేక్​కూ దర్శకత్వం వహిస్తుండడం విశేషం. సురేశ్​​ ప్రొడక్షన్స్​ ఈ సినిమాను నిర్మిస్తోంది. వెంకటేశ్​ ప్రస్తుతం 'ఎఫ్​ 3' చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఆయన ప్రధానపాత్రలో తెరకెక్కిన 'నారప్ప' చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు తరుణ్​ భాస్కర్​ దర్శకత్వంలో ఓ సినిమాకు వెంకీ గ్రీన్​సిగ్నల్​ ఇచ్చినట్లు టాలీవుడ్​లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇదీ చూడండి : 'దృశ్యం 2' షూటింగ్​ పూర్తి చేసుకున్న వెంకీమామ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.