ప్రముఖ సీనియర్ నటుడు మోహన్‌బాబు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. తిరుపతిలో ఉండే ఆయన సోదరుడు రంగస్వామి నాయుడు(63) గుండెపోటుతో కన్నుమూశారు. దీంతో మోహన్‌బాబు కుటుంబం, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
కాగా, రంగస్వామి మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. రంగస్వామి అంత్యక్రియలు గురువారం ఉదయం నిర్వహించనున్నారు. రంగస్వామి తిరుపతిలో వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. మోహన్‌బాబు చేపట్టే పలు సామాజిక కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనేవారు.
ఇదీ చూడండి: కరోనాతో ప్రముఖ దర్శకుడు కన్నుమూత!