విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయమౌతున్న 'దొరసాని' చిత్ర ట్రైలర్ విడుదలైంది. శివాత్మిక రాజశేఖర్ కథానాయిక. కేవీఆర్ మహేంద్ర దర్శకుడు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
పిరియాడిక్ చిత్రంగా తెరక్కెక్కిన ఈ సినిమా ప్రచార చిత్రం ఆకట్టుకుంటోంది. "ఉద్యమంలో చావు కూడా ఓ విజయమే.. మా ప్రేమ కూడా ఓ ఉద్యమమే" అంటూ సాగే డైలాగ్‌లు ఆకర్షిస్తున్నాయి. దొర కూతురుని ప్రేమించే ఓ పేదింటి కుర్రాడి ప్రేమ కథే చిత్ర కథాంశం.
హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్ ఈ చిత్రంతో హీరోయిన్గా పరిచయమవుతుంది. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేశ్ బాబు, మధురా శ్రీథర్ రెడ్డి, యాష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇది చదవండి: మరోసారి మెరిసిన '7/జీ' చిత్ర ప్రేమికులు!